అదనపు కట్నం కోసం వేధింపులు.. మహిళ మృతి

అదనపు కట్నం కోసం వేధింపులు.. మహిళ మృతి

హాలియా, వెలుగు : అదనపు కట్నం కోసం భర్త, అత్తామామ వేధిస్తుండడంతో ఉరి వేసుకొని ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆదివారం నల్గొండ జిల్లా హాలియాలో జరిగింది. ఎస్సై శివకుమార్‌‌‌‌‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం హాలియా పట్టణంలోని వీరబ్రహ్మేంద్రనగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన పులుసు రామాంజిరెడ్డికి గుంటూరు జిల్లా రెంటచింతల మండలం రెంటాలకు చెందిన అశ్విని (20)తో గతేడాది వివాహం జరిగింది. ఆ టైంలో అశ్విని ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌‌‌‌‌ రామాంజిరెడ్డికి రూ.8లక్షలు, 12 తులాల బంగారం ఇచ్చారు. కొంత కాలంగా అదనపు కట్నం తేవాలని అశ్వినిని భర్త, అత్తామామలు జానకమ్మ, కోటిరెడ్డి, మరిది నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి వేధిస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఆదివారం మధ్యాహ్నం ఫ్యానుకు ఉరివేసుకొని చనిపోయింది. విషయం తెలుసుకున్న అశ్విని తల్లిదండ్రులు, బంధువులు తమ కూతురు మృతికి భర్త, అత్తమామలు, మరిదే కారణమని ఆందోళనకు దిగారు. మృతురాలి తండ్రి శివరాంరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై తెలిపారు.