
పూణెలో దారుణం జరిగింది. ఓ ఓ హోటల్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆమె ప్రియుడు కాల్చి చంపాడు. ఈ ఘటన 2024 జనవరి 27 శనివారం పింప్రి చించ్‌వాడ్‌లోని హింజవాడి ప్రాంతంలోని ఓయో టౌన్ హౌస్ హోటల్‌లో చోటుచేసుకుంది. నిందితుడు రిషబ్ నిగమ్‌ను ముంబైలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వందనా ద్వివేది అనే మహిళ హింజావాడిలోని ప్రముఖ ఐటీ సంస్థలో పని చేస్తుంది, రిషబ్ నిగమ్ ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నివాసి. గత పదేళ్లుగా ఒకరికొకరు పరిచయం ఉన్న వీరిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వందనను కలవడానికి రిషబ్ పూణే వచ్చాడు. జనవరి 25వ తేదీన హింజావాడిలోని హోటల్‌ను బుక్ చేసుకున్నారు. వందన క్యారెక్టర్‌పై అనుమానం ఉండటంతో ఆమెను చంపేందుకు రిషబ్ ప్లాన్‌తో పూణెకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
వందనపై కాల్పులు జరిపిన తర్వాత రిషబ్ శనివారం రాత్రి 10 గంటల సమయంలో హోటల్ గది నుంచి బయటకు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది. ముంబైకి పారిపోయిన రిషబ్ ను ముంబైలో పోలీసులు అరెస్ట్ చేశారు. వందన మృతదేహం లభ్యమైన హోటల్ గదిని పోలీసులు సీల్ చేశారు. రిషబ్ ఆమెను చంపడానికి ఉపయోగించిన తుపాకీని ఎక్కడన నుండి తీసుకువచ్చాడు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.