మహిళల అక్రమ రవాణా ముఠా అరెస్ట్

మహిళల అక్రమ రవాణా ముఠా అరెస్ట్

విదేశాలకు మానవ అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు ఎల్బీ నగర్ ఎస్వోటీ  పోలీసులు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారన్నారు. నిందితుల నుండి 40 ఇండియా పాస్ పోర్టులు, 4 మొబైల్ ఫోన్స్, 6 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరు కడప, హైదరాబాద్ కు చెందిన వారీగా గుర్తించారు.

రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మీడియాతో మాట్లాడుతూ… మలక్ పేటలోని  ఓ ట్రావెల్స్ లో తనిఖీలు చేసి ముఠాను అరెస్ట్ చేశాం. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఖాదర్ బి అనే మహిళ ను ఒమన్ దేశానికి వెళ్ళడానికి సిద్ధం చేశారు. ఒమన్ దేశానికి వెళ్లాలంటే ఏజెంట్ తో ఒకరు గడపాలని షరతులు పెట్టారు. దీంతో అనుమానం వచ్చిన ఆ మహిళ పోలీసులకు సమాచారం అందించింది. దీంతో వారిపై దాడి చేసి ముఠాను అరెస్ట్ చేశాం. తెలుగు రాష్టాల నుండి మహిళలను ట్రాప్ చేసి వారికి డబ్బు ఆశ చూపించి ఇతర దేశాల్లో ఉండే వారికి అమ్ముతారు. అరబ్ దేశాలైన ఉమర్ , మస్కట్, అబూదాబి, దుబాయ్, బెహ్రెయిన్ షేక్లకు ఎక్కువగా మహిళలను అమ్ముతారు. ఇతర దేశాలకు పంపిస్తామని ఏజెంట్లు ఎవరైనా వచ్చి ఇబ్బందులు పెడితే మాకు సమాచారం అందించాలి‘.అని అన్నారు

విదేశాలకు వెళ్లేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • నకిలీ ఏజంట్లను నమ్మి మోసపోవద్దు
  • ఏ దేశం వెళ్తున్నారు, ఎన్ని రోజులు ఉంటారు, ఏ పని కోసం వెళ్తున్నారో స్పష్టమైన అవగాహన ఉండాలి
  • విదేశాల్లో విద్యా, ఉపాధి, ఉద్యోగం కల్పిస్తామని ఎవరు ఆశ చూపినా మోసపోవద్దు
  • అనధికార సంస్థలు, మోసపూరిత ఏజేంట్లు చాలామంది ఉన్నారు
  • మీరు ఏ వీసా మీద వెళ్తున్నారో పూర్తిగా అవగాహనా కలిగి ఉండాలి
  • ప్రభుత్వ అనుమతులు ఉన్న ఏజంట్ల ద్వారా, సంస్థల ద్వారానే వెళ్ళాలి
  • పాస్ పోర్ట్, వీసా ఎవరినీ నమ్మి ఇవ్వదు