సమాజానికి మహిళలే  వెన్నెముక

సమాజానికి మహిళలే  వెన్నెముక

భారతీయ సమాజానికి మహిళలే  వెన్నెముక అన్నారు పశ్చిమ బెంగాల్‌ సీఎం, త్రుణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కోల్ కతా లో  ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా ఎన్నికల తేదీలు ప్రకటించనప్పటికీ, తన పాత సాంప్రదాయాన్ని పాటిస్తూ…. మార్చి-8న  శ్రద్ధానంద పార్క్ నుంచి పాదయాత్ర (ర్యాలీ) ప్రారంభించారు. మహిళల సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందంటూ దీదీ ట్వీట్‌ చేశారు.  ప్రపంచంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు మమతా బెనర్జీ.