ప్రపంచ స్థాయికి మన మహిళా ఎంట్రప్రెన్యూర్లు

ప్రపంచ స్థాయికి మన మహిళా ఎంట్రప్రెన్యూర్లు

టై హైదరాబాద్, ఎస్‌ఆర్‌‌‌‌ఐఎక్స్ జత

70కి పైగా ఎంట్రప్రెన్యూర్లకు మెంటర్ క్యాంపులు

సీడ్ ఫండింగ్ నుంచి మార్కెట్ యాక్సస్ వరకు సాయం

హైదరాబాద్, వెలుగు: ఉమెన్ ఎంట్రప్రెన్యూర్లను గ్లోబల్‌‌గా నిలిపేందుకు వీహబ్, ఫిక్కీ లేడిస్‌‌తో పాటు సరికొత్తగా టై హైదరాబాద్, ఎస్‌‌ఆర్ ఇన్నోవేషన్‌‌ ఎక్స్చేంజ్(ఎస్‌‌ఆర్ఐఎక్స్) ముందుకు వచ్చాయి. మహిళా ఎంట్రప్రెన్యూర్లకు ఇంక్యుబేషన్ సపోర్ట్ ఇచ్చేందుకు టై ఉమెన్ మెంటర్ క్యాంపుల్లో పాలు పంచుకునేలా ప్రోత్సహించనున్నాయి. ఈ మేరకు ఈ రెండు సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. వ్యాపారాలను ప్రారంభించిన తొలినాళ్లలో మహిళా ఎంట్రప్రెన్యూర్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొనకుండా ఉండేలా టై హైదరాబాద్ పలు క్యాంపులను నిర్వహించనుంది. అంతేకాక ఎంట్రప్రెన్యూర్లకు సీడ్ ఫండింగ్‌‌ యాక్సస్‌‌ను, వారి ప్రొడక్టులకు, సర్వీసులకు అవసరమైన మార్కెట్‌‌ యాక్సస్‌‌ను ఈ సంస్థలు కల్పించనున్నాయి. టై ఉమెన్ మెంటర్ క్యాంపుల్లో 70 మందికి పైగా మహిళా ఎంట్రప్రెన్యూర్లకు  ఇంక్యుబేషన్ సపోర్ట్ ఇవ్వనున్నట్టు టై ఉమెన్ హైదరాబాద్ చాప్టర్ గ్లోబల్ నెట్‌‌వర్క్ ఆఫ్ ఎంట్రప్రెన్యూర్స్, ఎస్‌‌ఆర్‌‌‌‌ఐఎక్స్‌‌ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ ప్రకటించాయి. ఈ క్యాంపుల ద్వారానే మెంటరింగ్, లాంగ్ టర్మ్ కమిట్‌‌మెంట్‌‌ తీసుకునేలా గైడెన్స్‌‌ను కల్పించనున్నాయి. రెండు సంస్థలు కలిసి ఒకే లక్ష్యంపై పనిచేస్తాయని టై హైదరాబాద్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి అన్నారు. టై ఉమెన్ సభ్యులకు  మెంటరింగ్‌‌తో పాటు ఇంక్యుబేషన్ సపోర్ట్‌‌ను ఇస్తామని తెలిపారు. హైదరాబాద్ చాప్టర్‌‌‌‌లో టై ఉమెన్ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం ఆనంద దాయకంగా ఉందని ఎస్‌‌ఆర్‌‌‌‌ఐఎక్స్ సీఈవో శ్రీదేవీ దేవీ రెడ్డిఅన్నారు. పార్టనర్‌‌‌‌షిప్‌‌లో భాగంగా, టై ఉమెన్ హైదరాబాద్ చాప్టర్, ఎస్‌‌ఆర్‌‌‌‌ఐఎక్స్ వరంగల్ మహిళా ఎంట్రప్రెన్యూర్లను ఎంపిక చేస్తాయి. రెండేళ్ల వరకు బిజినెస్ ఇంక్యుబేషన్ సపోర్ట్‌‌ను ఇస్తాయి. మహిళా ఎంట్రప్రెన్యూర్లు ఎదిగేందుకు అవసరమైన అన్ని రకాల ప్రయోజనాలను కల్పిస్తాయి. మహిళా ఎంట్రప్రెన్యూర్లు తమ ఎంట్రప్రెన్యూర్‌‌‌‌షిప్‌‌లో మరింత ఎదిగేందుకు, సీడ్ ఫండింగ్ యాక్సస్‌‌ను, కార్పొరేట్ కనెక్షన్స్‌‌ను ఎస్‌‌ఆర్‌‌‌‌ఐఎక్స్‌‌ను అందిస్తుందని టై హైదరాబాద్ బోర్డు మెంబర్ రషీదా అదెన్వాలా అన్నారు. టై ఉమెన్ హైదరాబాద్ చాప్టర్‌‌‌‌ను 2020 మార్చిలో లాంఛ్ చేసింది.

గెలిచిన వారు గ్లోబల్‌‌ కాంపిటీషన్‌‌కు…

టై హైదరాబాద్, ఎస్‌‌ఆర్‌‌‌‌ఐఎక్స్‌‌లు ప్రతి 25 మందితో మూడు బ్యాచ్‌‌ల్లో వర్చ్యువల్ మెంటర్ క్యాంపులను నిర్వహిస్తాయి. మూడు వారాల బూట్‌ ‌క్యాంపుల్లో స్ట్రాటజీ, మార్కెటింగ్, ఫైనాన్స్, రెవెన్యూ, స్టాచుటరీ, లీగల్ కంప్లియెన్స్ వంటి పలు రకాల బిజినెస్ టాపిక్స్ ‌పై మెంటరింగ్ సెషన్స్‌ను అందిస్తాయి. ఈ మూడు బ్యాచ్‌‌ల కోసం 1520 మంది మహిళా ఎంట్రప్రెన్యూర్లను షార్ట్ లిస్ట్ చేశారు. వీరి నుంచి 70 మందికి పైగా ఎంట్రప్రెన్యూర్లను ఎంపిక చేస్తాయి. వీరికి 2020 ఆగస్ట్ మూడో వారంలో రీజనల్ కాంపిటీషన్ నిర్వహిస్తాయి. రీజనల్ కాంపిటీషన్ నుంచి గెలిచిన వారు 2020 డిసెంబర్‌‌‌‌లో జరుగబోయే గ్లోబల్ కాంపిటీషన్‌‌ కు హైదరాబాద్‌‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ గ్లోబల్ కాంపిటీషన్ దుబాయిలో లేదా టీజీఎస్‌‌లో జరుగనుంది. లక్ష డాలర్ల విలువైన ప్రైజ్ మనీని దక్కించుకునే అవకాశం ఉంటుంది.