యూపీ ఘజియాబాద్‎లో తొలిసారి ఎన్ కౌంటర్ చేసిన మహిళా పోలీసులు

 యూపీ ఘజియాబాద్‎లో తొలిసారి ఎన్ కౌంటర్ చేసిన మహిళా పోలీసులు

ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌‎లోని ఘజియాబాద్‌‌‌‌‌‌‌‌జిల్లాలో మొదటిసారిగా పూర్తిగా మహిళా అధికారులతో కూడిన టీమ్ ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్ చేసి.. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న 22 ఏండ్ల జితేంద్ర అనే నేరస్థుడిని అరెస్టు చేసింది. ఘజియాబాద్ కమిషనరేట్‌‎కు చెందిన విమెన్ పోలీస్ స్టేషన్ ఎస్‌‌‌‎ఐలు రితు త్యాగి, ఉపాసనా పాండే నేతృత్వంలో టీం ఆదివారం రాత్రి లోహియా నగర్ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తూ.. చెక్‌‌‌‌‌‌‌‌పాయింట్ వద్ద జితేంద్రను ఆపారు. ఆ సమయంలో అతడు ఢిల్లీలో దొంగిలించిన స్కూటర్‌‌‌‎పై వస్తున్నాడు. పోలీసులు అడ్డుకున్నా ఆగకుండా జితేంద్ర తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. 

తన వద్ద ఉన్న దేశీ పిస్టల్‌‎తో పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో మహిళా పోలీసు బృందం ఆత్మరక్షణలో భాగంగా తిరిగి కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో అతని కాళ్లకు బులెట్ గాయాలయ్యాయి. కింద పడిపోయిన జితేంద్రను వెంటనే వారు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‎లో పూర్తిగా మహిళా పోలీసులు టీం ఎన్​కౌంటర్​జరపడం ఇదే మొదటిసారి. జితేంద్రపై స్నాచింగ్, రాబరీ, దొంగతనం సహా పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.