నియోజకవర్గాల పునర్విభజన, జనాభా లెక్కల తర్వాతే మహిళా రిజర్వేషన్లు

నియోజకవర్గాల పునర్విభజన, జనాభా లెక్కల తర్వాతే మహిళా రిజర్వేషన్లు

కొత్త పార్ల మెంట్ లో జరుగుతున్న ప్రత్యేక సమావేశాల్లో  మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం. మహిళా రిజర్వేషన్ కోసం128 రాజ్యాంగ సవరణ బిల్లును  న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పాస్ అయితే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తోపాటు ఎస్సీ, ఎస్టీ కోటాలోనూ మూడో వంతు రిజర్వేషన్ కల్పించబడుతుంది. 

Also Read :- ఆ దేవుడే నాతో మహిళా బిల్లు పెట్టిస్తున్నారు : కొత్త పార్లమెంట్లో మోదీ తొలి స్పీచ్

 రాజ్యాంగం సవరణ ద్వారా మహిళా బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపనుంది. ఈ క్రమంలోనే కొన్ని కీలకమైన విషయాలను వెల్లడించింది మోదీ సర్కార్. మహిళా కోటా కోసం 128వ రాజ్యాంగ సవరణ బిల్లును సైతం లోక్ సభలో ప్రవేశపెట్టారు. 

  • మహిళా బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపినా.. అమలయ్యేది మాత్రం ఇప్పుడే కాదు.
  • చట్టం తర్వాత దేశ వ్యాప్తంగా జరిగే జనాభా లెక్కల తర్వాత మహిళా బిల్లు అమల్లోకి వస్తుంది.
  • మహిళా చట్టం చేసిన తర్వాత జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తుంది. 
  • అంటే కొత్త జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మాత్రమే చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది.
  • వచ్చే పార్లమెంట్ ఎన్నికలలోపు కొత్త జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన పూర్తయితేనే చట్టం అమల్లోకి వస్తుంది.. మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాల్సి వస్తుంది.. లేకపోతే ప్రస్తుత విధానమే అమల్లో ఉంటుంది.