అప్పు చెల్లించలేదని కరెంట్ పోల్ కు కట్టేశారు

అప్పు చెల్లించలేదని కరెంట్ పోల్ కు కట్టేశారు

కర్ణాటకలో దారుణం జరిగింది. తీసుకున్న రుణం చెల్లించలేదంటూ ఓ మహిళను కరెంట్ పోల్ కు కట్టేశారు. బెంగళూరు సమీపంలోని కొడిగిహెళ్లికి చెందిన మహిళ.. అవసరాల కోసం  డబ్బును అప్పుగా తీసుకుంది. అయితే సకాలంలో తిరిగి చెల్లించలేదు. దీంతో డబ్బులిచ్చిన వ్యక్తి.. మరికొందరితో కలిసి కిరాతకంగా వ్యవహరించాడు. మహిళను కరెంట్ పోల్ కు కట్టేశాడు. ఈ ఘటన స్థానికంగా దుమారం రేపింది. పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు.