మహిళలు..తిండితో నొప్పికి చెక్​ పెట్టవచ్చు

మహిళలు..తిండితో నొప్పికి చెక్​ పెట్టవచ్చు

నెలసరి నొప్పి, ప్రి మెనుస్ట్రువల్​ సిండ్రోమ్​ (పీఎమ్​ఎస్​​)తో రెగ్యులర్​గా ఎంతోమంది మహిళలు బాధపడుతున్నారు. అది కేవలం శారీరక ఆరోగ్యంతోనే కాకుండా మానసిక ఆరోగ్యంతోనూ ముడిపడి ఉంది. అలాంటి సమస్యలు తీరాలంటే తినే ఫుడ్​లో మార్పులు ఉండాలి. కొన్ని రకాల పదార్థాలు నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. పొత్తి కడుపులో నొప్పి, మొటిమలు, మలబద్ధకం, అలసట, చిరాకు, నిద్రలేమి, ఆందోళన వంటి పీఎమ్​ఎస్​ లక్షణాలు నెలసరికి ఐదు నుంచి పదకొండు రోజుల ముందే కనిపిస్తాయి. వీటితో పాటు నెలసరి సమయంలో యుటిరస్​ కాంట్రాక్షన్​ వల్ల కలిగే నొప్పి, హార్మోన్లు సరిగా బ్యాలెన్స్​ కాకపోవడం  వల్ల వచ్చే సమస్యలు మహిళలను తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. వీటన్నింటికీ చెక్​ పెట్టాలంటే, తీసుకునే  తిండి కూడా బాగుండాలని అంటున్నారు న్యూట్రిషనిస్ట్​లు. ఉదయంపూట పాలలో నానబెట్టిన కిస్మిస్​, కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుని తాగాలి. బ్రేక్​ఫాస్ట్​, లంచ్​, డిన్నర్​లో నెయ్యిని చేర్చుకుంటే మంచిది. అలాగే మధ్యాహ్నం లంచ్​లో పెరుగన్నంతో పాటు పాపడాలు కూడా తినాలి. వీటితో పాటు గుప్పెడు పల్లీలు లేదా జీడిపప్పును బెల్లంతో కలిపి తింటే  షుగర్​ క్రేవింగ్స్​, మూడ్​ స్వింగ్స్​,మలబద్ధకం తగ్గుతాయి. డిన్నర్​లో దాల్​ కిచిడీ, సాబుదానా కిచిడీ లేదా రాగి రొట్టె తినాలి. ఇవి సమస్యలను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

సెల్ ఫోన్ తెగ వాడుతున్నారు