ఫైనల్లో అమ్మాయిలు

ఫైనల్లో అమ్మాయిలు

రాంచీ: విమెన్స్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో ఇండియా ఫైనల్ చేరుకుంది. శనివారం జరిగిన సెమీస్‌‌లో ఇండియా 2–0తో సౌత్ కొరియాను ఓడించింది. సలీమా టెటె (11వ నిమిషం), వైష్ణవి (19వ నిమిషం) చెరో గోల్‌‌తో టీమ్‌‌ను గెలిపించారు.  మరో సెమీస్‌‌లో జపాన్‌‌ 2–1తో చైనాను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో జపాన్‌‌తో ఇండియా పోటీ పడనుంది.