మహిళా క్రికెట్ హెడ్ కోచ్ జై సింహ పై వేటు..

మహిళా క్రికెట్ హెడ్ కోచ్ జై సింహ పై వేటు..

హైదరాబాద్ మహిళ క్రికెట్ హెడ్ కోచ్ పై వేటు పడింది. హెడ్ కోచ్ జై సింహను సస్పెండ్ చేస్తున్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఛీఫ్ జగన్ మోహన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. మహాళా క్రికెటర్లను వేదిస్తున్నడని జై సింహ పై ఆరోపణలు వచ్చాయని అందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని జగన్ మోహన్ రావు తెలిపారు. జై సింహ పై విచారణ ఆదేశాలు జారీ చేస్తున్నట్టు చెప్పారు. మహిళా క్రికెటర్లను వేధిస్తే ఉపేక్షించేది లేదన్నారు. బాధ్యుల పై క్రిమినల్ కేసులు పెడతామని అన్నారు.

 క్రికెట్ టోర్నమెంట్ ఆడేందుకు విజయవాడకు వెళ్లిన మహిళా క్రికెటర్లు హైదరాబాద్ కు ఫ్లైట్ లో రావాల్సి ఉంది.  కానీ కోచ్ జై సింహ నిర్లక్ష్యం వహించడంతో ఫ్లైట్ మిస్ అయ్యింది. దీంతో వారంతా బస్సులో హైదరాబాద్ కు రావాల్సి వచ్చింది. బస్సులో వచ్చేప్పుడు జై సింహ మహిళా క్రికెటర్లను మధ్యం తాగుతూ బూతులు తిట్టాడు. ఈ క్రమంలోనే క్రికెటర్లు అంతా వీడియో తీసి హెచ్ సీఏకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నాలుగు రోజులైన క్రికెట్ బోర్డు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మహిళా క్రికెటర్లు వీడియోను సోషల్ మీడియాలోకి వదిలారు. వీడియో సంచలనంగా మారడంతో జై సింహను సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. 

Also Read : నేను వెళ్ళకూడదనుకున్నా..సూర్య నా మనసు మార్చేశాడు