IND vs ENG: నేను వెళ్ళకూడదనుకున్నా..సూర్య నా మనసు మార్చేశాడు: సర్ఫరాజ్ తండ్రి

IND vs ENG: నేను వెళ్ళకూడదనుకున్నా..సూర్య నా మనసు మార్చేశాడు: సర్ఫరాజ్ తండ్రి

దేశవాళీ క్రికెట్ లో దంచికొడుతున్న సర్ఫరాజ్‌‌‌‌కు రాజ్ కోట్ వేదికగా నిన్న జరిగిన టెస్టులో తుది జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఇండియా టెస్ట్ క్యాప్ అందజేశాడు. తన కల నిజమైన వేళ సర్ఫరాజ్‌‌‌‌ కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు.ఆ టైమ్‌‌‌‌లో  గ్రౌండ్‌‌‌‌లోకి వచ్చిన అతని  తండ్రి, కోచ్ నౌషద్ ఖాన్‌‌‌‌, భార్య కూడా  భావోద్వేగానికి గురయ్యారు. పరుగెత్తుకెళ్లి తండ్రిని హగ్ చేసుకున్న సర్ఫరాజ్ తన క్యాప్‌‌‌‌ను అతని చేతిలో పెట్టాడు.

సర్ఫరాజ్ తండ్రి నౌషద్  దాన్ని ముద్దుపెట్టుకున్నాడు. భార్య కన్నీళ్లు తుడిచిన సర్ఫరాజ్‌‌‌‌ సాయంత్రం తన తమ్ముడు, అండర్‌‌‌‌‌‌‌‌19 క్రికెటర్ ముషీర్ ఖాన్‌‌‌‌కు వీడియో కాల్‌‌‌‌ లో క్యాప్ చూపిస్తూ ‘ఏదో రోజు నువ్వు కూడా దీన్ని అందుకుంటావు’ అని అన్నాడు. ఎంతో ఎమోషనల్ గా సాగిన ఈ క్షణాలు చూడటానికి అసలు కారణం భారత స్టార్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ కారణం అని తెలుస్తుంది. మొదట్లో సర్ఫరాజ్ ఖాన్ తండ్రి రాజ్ కోట్ కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడట. అయితే సూర్య కుమార్ యాదవ్ చేసిన మెసేజ్ తో గ్రౌండ్ కు వచ్చినట్టు తెలుస్తుంది. తాజాగా ఈ విషయాన్ని సర్ఫరాజ్ తండ్రి బయటపెట్టాడు. 

మ్యాచ్ కు ముందు నేను రాజ్ కోట్ దగ్గరకు వెళ్లాలనుకోలేదు. వెళ్తే సర్ఫరాజ్ పై ఒత్తిడి పెరుగుతుందని భావించా. ఈ సమయంలో సూర్య కుమార్ యాదవ్ చేసిన మెసేజ్ తో నేను రాజ్ కోట్ కు వెళ్లాల్సి తాను మనసు మార్చుకున్నట్టు తెలిపాడు. 'నేను మీ భావోద్వేగాలను అర్థం చేసుకోగలను. కానీ నన్ను నమ్మండి. నేను నా టెస్ట్ అరంగేట్రంలో (గత సంవత్సరం మార్చిలో ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్‌లో) నా టెస్ట్ క్యాప్ అందుకుంటున్నప్పుడు.. మా నాన్న, అమ్మ నన్ను చూడటానికి వచ్చారు. ఆ క్షణం నాకు చాలా ప్రత్యేకమైనది. ఈ  క్షణాలు చాలా అరుదుగా వస్తాయి. మీరు తప్పక వెళ్లాలని నేను సూచిస్తున్నాను. అని సూర్య వెల్లడించినట్టు సర్ఫరాజ్ తండ్రి తెలిపారు. 

కెరీర్ లో నిన్న తొలి టెస్ట్ ఆడిన సర్ఫరాజ్ ఖాన్ (66 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 62) మెరుపు ఫిఫ్టీతో ఇంటర్నేషనల్ క్రికెట్‌‌‌‌లోకి తన రాకను ఘనంగా చాటుకున్నాడు. అయితే హాఫ్ సెంచరీ చేసి జోరు మీదున్న సమయంలో దురదృతుష్టావశాత్తు రనౌటయ్యాడు. రాజ్ కోట్ టెస్ట్ లో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌‌‌‌ టెస్ట్ అరంగేట్రం చేశాడు. మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్‌‌‌‌ టెస్టు క్యాప్‌‌‌‌ అందిస్తూ అతని జర్నీ గురించి చెప్పాడు.