మహిళా దినోత్సవ గూగుల్‌ డూడుల్‌

మహిళా దినోత్సవ గూగుల్‌ డూడుల్‌

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్… ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ప్రత్యేక డూడుల్‌తో నారీ శక్తికి వందనం పలికింది. వరల్డ్ వైడ్ గా పేరుపొందిన ప్రముఖ మహిళలు డూడుల్‌కు అనుబంధంగా స్ఫూర్తినిచ్చే వ్యాఖ్యలను అటాచ్‌ చేశారు. డూడుల్‌ పై మహిళ అనే పదాన్ని దాదాపు 11 భాషల్లో రాశారు. మన దేశానికి చెందిన ప్రముఖ బాక్సర్‌ మేరీకోమ్‌తో సహా 14 మంది ప్రముఖ మహిళలు సూక్తులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.