రూ.5 భోజనంతో పేదలకు ఆసరా..డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత

రూ.5 భోజనంతో పేదలకు ఆసరా..డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత

ముషీరాబాద్, వెలుగు: ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఏర్పాటుచేసిన ఇందిరమ్మ క్యాంటీన్ ను డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి సోమవారం పరిశీలించారు. అక్కడికి వచ్చిన వారితో కలిసి రూ.5 భోజనాన్ని తిన్నారు. ఈ సందర్భంగా అక్కడున్న వారితో మాట్లాడి సంక్షేమ పథకాలు ఎంతవరకు అందుతున్నాయో తెలుసుకున్నారు. ఇందిరమ్మ క్యాంటీన్ లతో మహిళలు ఆర్థికాభివృద్ధి చెందుతున్నారని అన్నారు. అంతకుముందు ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లోని నూతన బ్లాక్ ను స్థానిక కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు.

డైరీఫామ్​ వద్ద బస్సులు ఆపాలి

తార్నాక : తార్నాక డివిజన్ ఓల్డ్ డైరీ ఫామ్ వద్ద ఉన్న బస్ స్టాప్ లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత సోమవారం బస్టాప్ కు వెళ్లి ప్రయాణికులతో మాట్లాడారు. తర్వాత డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ 3, 3కే, 3హెచ్, 3ఏ రూట్లలో నడిచే బస్సులు ఇక్కడ ఆపకుండా వెళ్లడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముషీరాబాద్, కుషాయిగూడ డిపో మేనేజర్లకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. మోతే శోభన్ రెడ్డి 
పాల్గొన్నారు.