AndhraKingTaluka BOOKINGS: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ బుకింగ్స్ ఓపెన్.. రామ్ పోతినేని ఈ సారైనా హిట్ కొట్టేనా?

AndhraKingTaluka BOOKINGS: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ బుకింగ్స్ ఓపెన్.. రామ్ పోతినేని ఈ సారైనా హిట్ కొట్టేనా?

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. ‘మిస్ శెట్టి మిస్టర్  పోలిశెట్టి’ ఫేమ్ పి. మహేష్ బాబు మూవీ తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. మరో రెండ్రోజుల్లో మూవీ గురువారం (2025 నవంబర్ 27న) వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా విడుదల కానుంది.

ఈ సందర్భంగా మేకర్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ‘సాగర్ గాడు వచ్చేస్తున్నాడు.. టికెట్లు తీసేయండి. డిస్ట్రిక్ట్, బుక్ మై షో వంటి తదితర మూవీ టికెట్ ప్లాట్ఫామ్స్లో వెంటనే బుక్ చేసుకోండి’ అని మేకర్స్ తెలిపారు. 

రామ్  కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 22వ సినిమా. ఈ మూవీలో కన్నడ రియల్ స్టార్ హీరో ఉపేద్రకు రామ్‌ వీరాభిమానిగా కనిపించనున్నాడు. చిన్నప్పటి నుంచి సినిమాలపై పిచ్చి ప్రేమతో ఉన్న కుర్రాడి, లైఫ్ లోకి తన అభిమాన హీరో వస్తే, కథ ఎలాంటి మలుపు తిరిగిందనేదే ఆంధ్రా కింగ్. ఇప్పటికే ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.

రామ్ వరుస ఫెయిల్యూర్స్:

ప్రస్తుతం రామ్.. వరుస ఫెయిల్యూర్స్తో సతమతం అవుతున్నాడు. ‘ది వారియర్’, ‘స్కంద’, ‘డబల్ ఇస్మార్ట్’ మూవీలు భారీ డిజాస్టర్స్ అందుకున్నాయి. ఇప్పుడు ఈ మూవీతో స్ట్రాంగ్ హిట్ కొట్టాలనే సంకల్పంతో ఉన్నాడు. అందుకు తగ్గట్టుగానే తన అసలైన లవర్ బాయ్ యాంగిల్నే ఎంచుకున్నాడు. పూర్తిగా మాస్ నుంచి బయటకు వచ్చి లవ్ స్టోరీ చేస్తూ ఫ్యాన్స్కి కిక్ ఇవ్వనున్నాడు. ఈ క్రమంలోనే ఇందులో లిరిక్ రైటైర్గా, సింగర్గా కొత్త అవతారం కూడా ఎత్తారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ఇవ్వనుందో మరో రెండు రోజుల్లో తెలియనుంది. 

ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్రతో పాటుగా వీటీవీ గణేష్, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వివేక్, మెర్విన్  సంగీతం అందించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వర్తించారు.