ఎన్నికల్లో పురుషుల కంటే మహిళా అభ్యర్థులే ఎక్కువ

ఎన్నికల్లో పురుషుల కంటే మహిళా అభ్యర్థులే ఎక్కువ

అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న మహిళలు ఎన్నికల్లో పోటీచేయడంలోనూ రికార్డు సృష్టించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీచేసే మహిళా అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగినట్లు  ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. తొలి లోక్‌సభ ఎన్నికల తర్వాత, ఏడు దశాబ్దాల తర్వాత, 17 సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత.. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీచేయడంలో పురుషుల కంటే మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. మహిళలకు సమాన ఓటు హక్కు కల్పించేందుకు అమెరికాలాంటి అగ్రరాజ్యానికే 144 ఏళ్లు పట్టిందని.. కానీ ఇండియాలో మాత్రం స్వాతంత్ర్యం వచ్చిన ఏడాదికే మహిళలకు ఈ హక్కు లభించిందని ఆయన గుర్తు చేశారు. 1971 ఎన్నికల తర్వాత మహిళా ఓటర్ల సంఖ్య 235.72శాతం పెరిగిందని ఆయన అన్నారు. గత 2019 ఎన్నికల్లో మహిళా అభ్యర్థుల సంఖ్య 67శాతానికి పెరిగినట్లు సుశీల్ చంద్ర తెలిపారు.