పదోసారి ఆస్ట్రేలియన్​ ఓపెన్​ మెన్స్​ సింగిల్స్​ టైటిల్ సొంతం

పదోసారి ఆస్ట్రేలియన్​ ఓపెన్​ మెన్స్​ సింగిల్స్​ టైటిల్ సొంతం
  • ఆస్ట్రేలియన్​ ఓపెన్​ చాంప్​ నొవాక్​ జొకోవిచ్​
  •  22 గ్రాండ్​స్లామ్స్​తో నడాల్​ రికార్డు సమం

మెల్​బోర్న్​: కీలక టైమ్​లో బలమైన సర్వీస్​లు.. ప్రత్యర్థి పుంజుకునే దశలో సూపర్​ ఏస్​లు.. శక్తివంతమైన ఫోర్ హ్యాండ్​​, బ్యాక్​హ్యాండ్​ షాట్లు.. బేస్​లైన్​ గేమ్​లో తిరుగులేని పెర్ఫామెన్స్​.. అద్భుతమైన క్రాస్​ కోర్టు రిటర్న్స్​తో చెలరేగిన సెర్బియా టెన్నిస్​ స్టార్​ నొవాక్​ జొకోవిచ్​.. పదోసారి ఆస్ట్రేలియన్​ ఓపెన్​ మెన్స్​ సింగిల్స్​ టైటిల్​ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో నాలుగోసీడ్​ జొకో 6–3,7–6 (7/4), 7–6 (7/5)తో థర్డ్​సీడ్​ స్టెఫానోస్​ సిట్సిపాస్​ (గ్రీస్​)పై గెలిచాడు. ఓవరాల్​గా 22వ గ్రాండ్​స్లామ్​ను సొంతం చేసుకున్న నొవాక్​.. టెన్నిస్​ హిస్టరీలో అత్యధిక గ్రాండ్​స్లామ్స్​ నెగ్గిన స్పెయిన్​ లెజెండ్​ రఫెల్​ నడాల్​ (22)తో సమంగా నిలిచాడు. తాజా విక్టరీతో ఏటీపీ ర్యాంకింగ్స్​లో నంబర్​వన్​ ర్యాంక్​ను సొంతం చేసుకోనున్న జొకోవిచ్​.. హార్డ్​ కోర్ట్​లో తన వరుస విజయాల సంఖ్యను 28కి పెంచుకున్నాడు. జొకో కెరీర్​లో ఇప్పటి వరకు 7 వింబుల్డన్​, 3 యూఎస్​ ఓపెన్​, 2 ఫ్రెంచ్​ ఓపెన్​ టైటిల్స్​ ఉన్నాయి.  

అచ్చొచ్చిన కోర్టులో..

గతేడాది కొవిడ్​ రూల్స్​ను పాటించకపోవడంతో టోర్నీకి దూరమైన జొకో ఈసారి మాత్రం అదరహో అనిపించాడు. తనకు అచ్చొచ్చిన కోర్టులో.. తనకు కలిసొచ్చిన నైట్స్​లో.. తనకు మాత్రమే సాధ్యమైన ఆటతో  సత్తాచాటాడు.  2 గంటలా 56 నిమిషాల మ్యాచ్​లో ప్రతిఘటన ఎదురైన ప్రతిసారి తన ట్రేడ్​ మార్క్​ ఆటతో అదరగొట్టాడు. ఓవరాల్​ మ్యాచ్​లో సిట్సిపాస్​ 15 ఏస్​లు కొట్టినా.. 42  తప్పిదాలతో ఓటమిపాలయ్యాడు. 7 ఏస్​లు సంధించిన జొకో.. 22 అనవసర తప్పిదాలు ​ చేశాడు.