చైనాలో ముస్లింలపై వేధింపులు: మేం బహిరంగంగా మాట్లాడలేం

చైనాలో ముస్లింలపై వేధింపులు: మేం బహిరంగంగా మాట్లాడలేం

చైనాలో ముస్లింలపై జరుగుతున్న వేధింపుల గురించి తాము బహిరంగంగా మాట్లాడలేమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ఆ దేశం తమకు ఎంతో సాయం చేసింది, కాబట్టి ఏదైనా సమస్య ఉంటే చైనా ప్రభుత్వంతో అంతర్గతంగా చర్చిస్తామని తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ ఆయనను ఇంటర్వ్యూ చేసింది.

కశ్మీర్ అంశంపై పదేపదే మాట్లాడుతున్న పాకిస్థాన్ ఎందుకు చైనాలోని జింగ్‌జియాంగ్ సహా పలు ప్రాంతాల్లో ముస్లింలపై జరుగుతున్న హింస గురించి నోరు మెదపడంలేదని ఇమ్రాన్‌ను ప్రశ్నించారు ఆ సంస్థ ప్రతినిధి. దీనికి ఆయన బదులిస్తూ తాము క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో చైనా ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. చైనాకు తాము చాలా రుణపడి ఉన్నామని చెప్పారు. ఆ దేశం చేసిన సాయాన్ని మరువలేమని, చైనాకు సంబంధించిన ఏ విషయాన్నైనా అంతర్గతంగానే చర్చించాలని తాము నిర్ణయించుకున్నామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగంగా మాట్లాడబోమని అన్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. అలాగే చైనాలో ముస్లింలపై జరుగుతున్న హింస, అణచివేత గురించి తనకు పెద్దగా అవగాహన కూడా లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారాయన. దాని గురించి అప్పుడప్పుడూ చదవడం తప్ప ఏమీ తెలియదన్నారు. అక్కడ జరుగుతున్నది కశ్మీర్‌తో పోలిస్తే చాలా తక్కువ అని సర్ది చెప్పుకొచ్చారు.

More News:

నిర్భయ దోషుల్ని ఉరి తీయడానికి నేను రెడీ: పవన్

చిన్నతనంలో నాపై రేప్ జరిగింది: అర్జున్ రెడ్డి మూవీ స్టార్

కొద్ది రోజుల్లో పెళ్లి అనగా.. పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లి జంప్!

ఎలాగో చస్తాం.. మళ్లీ ఉరి శిక్షెందుకు: సుప్రీంలో నిర్భయ దోషి వింత పిటిషన్