అక్రమార్కులను వదిలిపెట్టేది లేదు

అక్రమార్కులను వదిలిపెట్టేది లేదు

ఆయుష్మాన్ భారత్ పథకంలో అక్రమాలు జరిగితే సహిచేంది లేదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆయుష్మాన్ భారత్ యోజన అమలులో ఉన్న 27 ఆస్పత్రుల్లోని రికార్డుల్లో అవకతవకలు బయటడ్డాయి. ఈ నేపథ్యంలో మోసాలను సహిచేంది లేదన్న సీఎం..బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో12 జిల్లాలోని 84 ఆస్పత్రుల రికార్డులను పరిశీలించిన అధికారులు..అందులో 27 హాస్పిటల్స్ లో అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. ఆయుష్మాన్ భారత్ యోజనలో ఎలాంటి కుంభకోణం జరిగినా సహించేది లేదని..అక్రమాలకు పాల్పడిన వారిని జైలుకు పంపుతామన్నారు.అంతేకాదు ఆయా సంస్థలపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.