కాగజ్ నగర్ మున్సిపల్ ఆఫీస్ ముందు కార్మికుల ధర్నా

కాగజ్ నగర్  మున్సిపల్ ఆఫీస్ ముందు కార్మికుల ధర్నా

కాగజ్ నగర్, వెలుగు: పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పారిశుధ్య కార్మికులు కాగజ్ నగర్ మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. మున్సిపల్​లో పనిచేస్తున్న 120 మంది వర్కర్లకు 4 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, కుటుంబాలను ఎలా  పోషించాలని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ అంజయ్య వచ్చి సర్దిచెప్పినా వినలేదు. దీంతో  చైర్ పర్సన్ షాహీన సుల్తానా స్పందించారు.

ఆమె తరఫున మున్సిపల్ మాజీ చైర్మన్ దస్తగీర్ కార్మికుల వద్దకు వచ్చి కార్మిక సంఘం నాయకులతో చర్చలు జరిపారు. సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. వెంటనే ఒక నెల వేతనం ఇవ్వడంతో పాటు మరో 15 రోజుల్లో మిగిలిన జీతాలు ఇచ్చేలా చూస్తామని చెప్పడంతో వారు ధర్నా విరమించారు. 

ALSO READ ; జైపూర్ మండలంలోని ఇసుక డంపులు సీజ్