జైపూర్ మండలంలోని ఇసుక డంపులు సీజ్

జైపూర్ మండలంలోని  ఇసుక డంపులు సీజ్

జైపూర్, వెలుగు: మండలంలోని ఇందారం గోదావరి నది నుంచి అక్రమంగా తరలించిన ఇసుక డంపులను రెవెన్యూ అధికారులు బుధవారం సీజ్ చేశారు. తహసీల్దార్ వనజారెడ్డి వివరాల ప్రకారం.. రామారావు పేట శివారులో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలించి డంప్​ చేసి రాత్రికి రాత్రే ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు దాదాపు 25 ట్రాక్టర్ల ఇసుక డంప్​లను గుర్తించి సీజ్ చేసినట్టు తెలిపారు.

ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్​ఐ తిరుపతి, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ALSO READ ; వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి