వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

చెన్నూరు, వెలుగు: కోటపల్లి మండలం శంకరాపురం గ్రామానికి చెందిన సూరం శ్రీనివాస్ రెడ్డి, సత్తక్క కుమారుడు సందీప్ రెడ్డి-శృతి రెడ్డి రిసెప్షన్​కు చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం కోటపెల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ నాయకులు ఆలూరి సంపత్ ఇంట్లో సమావేశమై ప్రజా సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, లీడర్లు గుడిసెల బాపిరెడ్డి, పోటు రాంరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, మహేశ్ తివారి, రాజమల్ల గౌడ్, మల్లయ్య, బన్సీ నాయక్ తదితరులు పాల్గొన్నారు..

ALSO READ ; దేవాలయ భూములను పరిరక్షించండి: ఎండోమెంట్ డైరెక్టర్ హనుమంతరావు ఆదేశం