మంచిర్యాలలో శాలివాహన పవర్​ ప్లాంట్​కార్మికుల ఆందోళన

మంచిర్యాలలో శాలివాహన పవర్​ ప్లాంట్​కార్మికుల ఆందోళన

మంచిర్యాల, వెలుగు: పెండింగ్​లో ఉన్న బెనిఫిట్స్​ను వెంటనే చెల్లించాలని డిమాండ్​చేస్తూ పాత మంచిర్యాలలోని శాలివాహన బయోమాస్​పవర్​ప్లాంట్​ కార్మికులు ఆదివారం ప్లాంట్​ ఎదుట ఆందోళన చేపట్టారు. కార్మిక సంఘం అధ్యక్షుడు కుంటాల శంకర్ మాట్లాడుతూ.. పవర్ ప్లాంట్​ను నిరుడు డిసెంబర్​లో మూసివేయడం వల్ల కార్మికులు ఉపాధిని కోల్పోయారన్నారు. ఏడాది గడుస్తున్నా మూడేండ్లుగా పెండింగ్​లో ఉన్న బోనస్​లు, వేతనాలు, గ్రాట్యుటీ, ప్లాంట్ క్లోజింగ్ బెనిఫిట్స్ ఇవ్వకుండా కంపెనీ మేనేజ్​మెంట్ ​మొండిగా వ్యవరిస్తోందని ఫైర్ ​అయ్యారు.

ఈ విషయాన్ని పలుమార్లు కార్మిక శాఖ అధికారుల దృష్టికి, ఎమ్మెల్యే దివాకర్​రావు దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.కార్మికులకు నష్టం జరిగితే కార్మిక శాఖ అధికారులు, యాజమాన్యమే బాధ్యత వహించాలని నాయకుడు చెట్టి శ్రీనివాస్​హెచ్చరించారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే న్యాయం చేయాలన్నారు. నాయకులు ఎన్.సత్యనారాయణ, ఎస్.ఆనందరావు, కె.సుధీర్, రవిశంకర్, ఏ.రాజయ్య, ఎస్.తిరుపతి, కె.బుచ్చయ్య పాల్గొన్నారు.