లాక్ డౌన్ వల్ల ఎక్కువ శాతం ప్రజలు తమ భవిష్యత్తు పై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తేలింది. లాక్ డౌన్ తరువాత ఉద్యోగం, ఆర్ధిక పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఆందోళనలు మొదలైనట్లు తెలుస్తోంది.
బెంగళూర్ కు చెందిన స్లీప్ సొల్యూషన్ స్టార్టప్ ఓ సర్వే చేసింది. లాక్ డౌన్ లో ఎన్ని గంటలకు పడుకుంటున్నారు. లాక్ డౌన్ కు ముందు ఎన్ని గంటలకు పడుకునేవారు. లాక్ డౌన్ తరువాత జరిగే పరిణామాల గురించి ఏమని అనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది.
ఇందులో భాగంగా 1500 మందిని సర్వే చేయగా.. మనదేశంలో ఇంటి నుంచి పనిచేసే వారిలో 67శాతం మంది నిద్రపోయే సమయాన్ని మార్చుకున్నట్లు గుర్తించారు. రాత్రి 11గంటల తరువాతే ఎక్కువ మంది నిద్ర పోతున్నట్లు సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు.
లాక్ డౌన్ ముగిసిన తరువాత టైం కి నిద్రపోతామని 81 శాతం మంది, 46 శాతం మంది లాక్ డౌన్ కు ముందు రాత్రి 11 గంటలకు ముందు నిద్రపోతున్నట్లు , లాక్ డౌన్ లో 39 శాతం మంది మాత్రమే 11గంటలకు ముందే పడుకుంటున్నట్లు సర్వేలో తేలింది.
25 శాతం మంది లాక్ డౌన్ కు ముందు రాత్రి 12 గంటలకు పడుకుంటున్నారని , 35 శాతం మంది రాత్రి 12 తర్వాత పడుకుంటున్నట్లు సర్వే సంస్థ ప్రతినిధులు చెప్పారు.
కరోనా వైరస్ నేపథ్యంలో ఉద్యోగ భద్రత, ఫైనాన్షియల్ మరియు కుటుంబం / స్నేహితుల భద్రత గురించి ఆందోళన చెందుతూ 50 శాతం మంది నిద్ర లేమి సమస్యలతో బాధపడుతున్నట్లు సర్వే లో తేలింది.
