సెల్‌తో తీసిన షార్ట్ ఫిల్మ్‌కి ఇంటర్నేషనల్ అవార్డులు

సెల్‌తో తీసిన షార్ట్ ఫిల్మ్‌కి ఇంటర్నేషనల్ అవార్డులు

సెల్‌‌ఫోన్‌‌తో తీసిన అస్సామీ షార్ట్ ఫిల్మ్ ‘వర్కింగ్ మ్యాన్‌‌’ ఇంటర్నేషనల్‌‌ ఫిల్మ్‌‌ ఫెస్టివల్స్‌‌లో సత్తా చాటుతోంది. బస్కా జిల్లాలో ఓ మారుమూల గ్రామానికి చెందిన బిశాల్‌‌ స్వర్గియారీ డైరెక్ట్‌‌ చేసిన ఈ షార్ట్ ఫిల్మ్‌‌  ఇప్పటికే మూడు అవార్డులను దక్కించుకుంది. రెడ్‌‌మి నోట్‌‌7 ఫోన్‌‌తో తీసిన ఈ షార్ట్ ఫిల్మ్‌‌ను.. ఓ మొబైల్ యాప్‌‌లోనే ఎడిట్ చేయడం మరో విశేషం.

‘ఓ  రైతు జీవితంలో  ఒకరోజు’ అనే కాన్సెప్ట్‌‌తో ఈ షార్ట్‌‌ ఫిల్మ్ తీశాడు బిశాల్‌‌. యూరోపియన్‌‌ ఫిల్మ్ ఫెస్టివల్‌‌, పోర్ట్‌‌బ్లెయిర్‌‌, కోల్‌‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ పెస్టివల్స్‌‌లో అవార్డులు దక్కించుకుంది.  అంతేకాదు ఖాంరుబు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌కి అఫీషియల్‌‌ ఎంట్రీగా ఎంపికైంది వర్కింగ్ మ్యాన్‌‌. త్వరలో తన యూట్యూబ్ ఛానెల్‌‌లో ఈ షార్ట్ ఫిల్మ్‌‌ను రిలీజ్ చేయబోతున్నట్లు బిశాల్ చెబుతున్నాడు.