మగాళ్లు ఎక్కడ : ఐటీ, బ్యాంకింగ్ లో 40 శాతం ఉద్యోగులు మహిళలే

మగాళ్లు ఎక్కడ : ఐటీ, బ్యాంకింగ్ లో 40 శాతం ఉద్యోగులు మహిళలే

ఒకప్పుడు మహిళలు వంటింటికే పరిమితం అన్న భావనలో ఉండేవారు. కానీ, కాలానుగుణంగా సమాజం ఆలోచనాతీరులో వచ్చిన మార్పు కారణంగా మహిళల్లో అక్షరాస్యత పెరుగుతూ వస్తోంది. మగవారితో సమానంగా ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుంటూ వస్తున్నారు మహిళలు.ఈ మధ్యకాలంలో జరిగిన కాలంలో దేశవ్యాప్తంగా జరిగిన కాలేజ్ ప్లేస్మెంట్స్ యొక్క డేటా గమనిస్తే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఈ ఏడాదికి గాను ప్లేస్మెంట్స్ లో మహిళల వాటా 5శాతం పెరిగిందని తెలుస్తోంది. అంతే కాకుండా మొత్తం ప్లేస్మెంట్స్ లో మహిళల 35 నుండి 40శతం వరకు ఉందని తేలింది. ముఖంగా ఐటీ, బ్యాంకింగ్ రంగంలో మహిళల ప్లేస్మెంట్స్ వాటా ఎక్కువగా ఉందని తేలింది. దీన్ని బట్టి చుస్తే, ఇంకొన్ని సంవత్సరాల్లో ఐటీ, బ్యాంకింగ్ రంగాలను శాసించే స్థాయికి మహిళలు వెళ్లినా ఆశ్చర్యం లేదని చెప్పాలి.

ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో మహిళలదే హవా:

హయ్యర్ ప్రో సంస్థ జరిపిన సర్వే ప్రకారం ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో జరిగిన ప్లేస్మెంట్స్ లో ఎక్కువ శాతం మహిళలే ఉన్నారని తేలింది. జోన్ల వారీగా జరిపిన ఈ సర్వేలో 39శాతం మహిళల ప్లేస్మెంట్స్ తో సౌత్ జోన్ టాప్ ప్లేస్ లో ఉండగా తర్వాతి స్థానంలో వెస్ట్ జోన్, నార్త్ జోన్, ఈస్ట్ జోన్ నిలిచాయి.

మేల్, ఫీమేల్ వర్కింగ్ పాపులేషన్ మధ్య తగ్గుతున్న గ్యాప్:

ఈ సర్వే ప్రకారం, ఇండియాలో వర్కింగ్ ఉమెన్, మెన్ మధ్య తేడా తగ్గుతున్నట్లు తేలింది. జెండర్ ఎక్వాలిటీ విషయంలో అవేర్నెస్ పెంచటం కోసం ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు సక్సెస్ అవ్వటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. వర్కింగ్ ఉమెన్స్ రేషియో పెరగటం వల్ల దేశం ఆర్థిక వృద్ధి రేటు కూడా పెరుగుతుందని నిపుణుల అభిప్రాయం.