ఇమ్యూనిటీ పెంచే వర్కవుట్స్​

V6 Velugu Posted on Jun 01, 2021

పొట్ట, బరువు తగ్గడానికి, సిక్స్‌‌ ప్యాక్‌‌ కోసమే కాకుండా ఇమ్యూనిటీ పెంచుకునేందుకు కూడా వర్కవుట్స్‌‌ చేయాలంటున్నారు ఫిట్​నెస్​ ఎక్స్‌‌పర్ట్స్‌‌. కరోనా వంటి జబ్బుల నుంచి రక్షణ పొందాలంటే ఇమ్యూనిటీ చాలా అవసరం. అందుకు డైట్‌‌తో పాటు వర్కవుట్స్‌‌ కూడా చేయాలి.

లాక్‌‌డౌన్‌‌ టైం నడుస్తోంది కాబట్టి పార్క్‌‌లు, జిమ్‌‌లకు వెళ్లి వర్కవుట్స్‌‌ చేయడం కుదరదు. ఇంట్లోనే ఇమ్యూనిటీని పెంచే ఎక్సర్‌‌‌‌సైజ్​లు చేయాలి. అందుబాటులో ఉన్న ఎక్విప్‌‌మెంట్‌‌నే వాడుకుని వర్కవుట్స్‌‌ చేస్తే రిజల్ట్​ ఉంటుంది. అమెరికాకు చెందిన ‘జర్నల్‌‌ ఆఫ్ స్పోర్ట్‌‌ అండ్‌‌ హెల్త్‌‌ సైన్స్‌‌’ ప్రకారం రోజూ మోడరేట్‌‌ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ చేయాలి. రెగ్యులర్‌‌‌‌గా వర్కవుట్స్‌‌ చేసే వాళ్లే కాకుండా కొత్తగా ఎక్సర్​సైజ్​ మొదలుపెట్టిన వాళ్లయినా లో– ఇంపాక్ట్‌‌ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ నుంచి మోడరేట్‌‌ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ వరకు చేయొచ్చు. 

సైడ్‌‌ టు సైడ్‌‌ జంప్స్‌‌
ఇదేమంత కష్టమైంది కాదు. రెండు కాళ్లతో అటుఇటు జంప్‌‌ చేస్తే చాలు. మరీ ఎక్కువ ఎత్తుకు ఎగరక్కర్లేదు. బాడీ సహకరించిన వాళ్లు ఈ వర్కవుట్‌‌ చేయొచ్చు. రెగ్యులర్‌‌‌‌గా చేస్తుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. దీనివల్ల బాడీ స్ట్రెంత్, స్టెబిలిటీ పెరుగుతుంది. ముఖ్యంగా యాంటీబాడీస్‌‌ను ప్రొడ్యూస్​ చేయడంలో ఈ వర్కవుట్‌‌ బాగా ఉపయోగపడుతుంది.

పలాటీజ్‌‌
ఇమ్యూనిటీ పవర్‌‌‌‌ పెరగాలంటే రెస్పిరేటరీ వ్యవస్థ బాగుండాలి. ఇలా ఉండాలంటే దీని పవర్‌‌‌‌ పెంచే ‘పలాటీజ్‌‌’ లాంటి వర్కవుట్స్‌‌ చేయాలి. ఇది కూడా ఇంట్లోనే చేయగలిగే సింపుల్‌‌ వర్కవుట్‌‌. యోగా మ్యాట్‌‌పై వెల్లకిలా పడుకుని, నడుము నేలపై ఉంచి కాళ్లు, శరీరాన్ని వీలైనంత పైకిలేపాలి. చేతులు సమాంతరంగా చాపి, పాదాలకు దగ్గరగా తీసుకు రావాలి. ఇది ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. దీనిలో ఉన్న ఇతర పద్ధతులు కూడా ట్రై చేయొచ్చు. నడుము, వెన్నునొప్పి వంటి సమస్యలు ఉన్నవాళ్లు ఇది చేయకూడదు.

వాకింగ్‌‌
లో– ఇంపాక్ట్‌‌ ఎక్సర్‌‌‌‌సైజ్​ల్లో మొదటిది వాకింగ్‌‌. వాకింగ్‌‌తో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్‌‌ ఉన్నాయి. 
కనీసం అరగంట వాకింగ్‌‌ చేయగలిగినా బాడీలోని ఇమ్యూనిటీ సిస్టమ్‌‌ డెవలప్‌‌ అవుతుంది. 

స్క్వాట్స్‌‌
ఇంట్లోనే చాలా సింపుల్‌‌గా చేయగలిగే వర్కవుట్‌‌ స్క్వాట్స్‌‌. గోడకుర్చీ వేసినట్లుగా మోకాళ్లపై నిల్చొని, పైకి లేచి, మళ్లీ తిరిగి అదే స్థానానికి రావాలి. 
చేతులు ఛాతి దగ్గర ఉంచాలి. 
స్క్వాట్స్‌‌లో చాలా రకాలున్నాయి. వీటిని వీలును  బట్టి ప్రాక్టీస్‌‌ చేయొచ్చు. స్క్వాట్స్‌‌ వల్ల ఇమ్యూనిటీ పవర్‌‌‌‌ పెరుగుతుంది. బాడీ స్ట్రాంగ్‌‌గా అవ్వడమే కాకుండా, బ్లడ్‌‌ సర్క్యులేషన్‌‌ కూడా ఇంప్రూవ్‌‌ అవుతుంది.

క్లాసిక్ సూపర్‌‌‌‌మాన్‌‌ పోజ్‌‌
సూపర్‌‌‌‌మాన్‌‌ గాల్లో ఎగిరిపోయినట్లుగా చేసేదే ‘క్లాసిక్‌‌ సూపర్‌‌‌‌మాన్‌‌ పోజ్‌‌’ వర్కవుట్‌‌. యోగా మ్యాట్‌‌పై పొట్ట నేలకు ఆన్చి పడుకోవాలి. 
పొట్ట భాగం నేలను తాకుతూ ఉండి, కాళ్లు, చేతులు పైకి లేపాలి. అలా ఒకట్రెండు నిమిషాలు ఉంచగలిగితే చాలు. పొట్ట సంబంధ సమస్యలు ఉన్నవాళ్లు ఈ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ చేయకూడదు.

Tagged coronavirus, Gym, exercise, fat, immunity, Workouts, Weight Loss, squats, stomach fat, side to side jumps, walking, classic superman pose

Latest Videos

Subscribe Now

More News