రంగంలోకి దిగిన ‘వలీ’.. రష్యన్ బలగాల్లో దడ

రంగంలోకి దిగిన ‘వలీ’.. రష్యన్ బలగాల్లో దడ

కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న వార్ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. రష్యా సైనికశక్తిని ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ అన్ని మార్గాలను వినియోగించుకుంటోంది. తాజాగా దునియాలోనే అత్యుత్తమ స్నైపర్లలో ఒకరైన ‘వలీ’ని రంగంలోకి దింపింది. ఆ దేశ ప్రెసిడెంట్ జెలెన్స్కీ పిలుపుమేరకు ఉక్రెయిన్ తరఫున పోరాడేందుకు వలీ వచ్చాడు. నింగి, నేల.. లక్ష్యం ఏదైనా గురి తప్పకుండా కూల్చేయడం, కాల్చేయడం అతడి ప్రత్యేకత. భార్య, ఏడాది కూడా నిండని కుమారుడ్ని వదిలేసి వలీ యుద్ధంలోకి దూకేశాడు. అంతేకాదు రెండ్రోజుల్లోనే ఆరుగురు రష్యా సైనికుల్ని మట్టుబెట్టాడట. 

ఫ్రెంచ్, కెనడియన్ కంప్యూటర్ సైంటిస్ట్ అయిన వలీ.. రాయల్ కెనడియన్ రెజిమెంట్ లో పని చేశాడు. వలీ అనేది అతడి నిక్నేమ్. అరబిక్ భాషలో దీనికి సంరక్షకుడని అర్థం. ఒకసారి తన విధుల్లో భాగంగా అఫ్గానిస్థాన్ లో పోరాడుతున్న టైమ్ లో పదుల సంఖ్యలో శత్రువుల్ని చంపేశాడు. దీంతో అక్కడి ప్రజలు అతడికి ‘వలీ’ అనే పేరు పెట్టారు. దునియాలో బెస్ట్ స్నైపర్ గా పేరొందిన వలీ.. అత్యధికంగా రోజుకు 40 మందిని మట్టుపెట్టే సత్తా ఉన్నోడట. మామూలుగా సగటు స్నైపర్ రోజుకు 5 నుంచి 6 లక్ష్యాలను ఛేదించగలడు. అదే ఉత్తమ పనితీరు కనబరిచే వారు రోజుకు 7 నుంచి 10 టార్గెట్లను ఛేదిస్తారు. ఇక వలీ.. 2017లో 3,540 మీటర్ల దూరంలో ఉన్న ఐఎస్ జిహాదీని కాల్చి చంపాడు. ఇంత దూరంలో ఉన్న టార్గెట్ ను ఛేదించడంలో అతడిదే రికార్డు. 

మరిన్ని వార్తల కోసం:

ఉద్యోగులకు షాకిచ్చిన ఈపీఎఫ్ఓ

పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా