భారత జీడీపీ 6.9కి పెరిగే అవకాశం: వరల్డ్ బ్యాంక్

భారత జీడీపీ 6.9కి పెరిగే అవకాశం: వరల్డ్ బ్యాంక్
  • భారత ఆర్ధిక వ్యవస్థ అంచనాను అప్ గ్రేడ్ చేసిన ప్రపంచ బ్యాంక్

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ అంచనాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం నుంచి 6.9 శాతానికి అప్ గ్రేడ్ చేసినట్లు ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టంగా పుంజుకుందని, అత్యంతవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒకటని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.

ఈ ఏడాది సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 7.1శాతంగా ఉందని నివేదికలో తెలిపింది. యూఎస్, యూరో ప్రాంతం, చైనా నుంచి వచ్చే స్పిల్ ఓవర్ ల వల్ల భారత్ ప్రభావితమవుతుందని ప్రపంచ బ్యాంక్ ఇండియా డెవలప్ మెంట్ అప్ డేట్ తెలిపింది.ద్రవ్యవిధానం కఠినతరం చేయడం, అధిక కమోడిటీ ధరల దేశ వృద్ధిని ప్రభావితం చేసే అంశాలని ప్రపంచ బ్యాంక్ నివేదికలో వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని తక్కువ ప్రభావంతో కొనసాగించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.