పాకిస్తాన్ లో అన్నం కోసం అలమటిస్తున్న 10 కోట్ల మంది : ప్రపంచ బ్యాంక్ హెచ్చరిక

పాకిస్తాన్ లో అన్నం కోసం అలమటిస్తున్న 10 కోట్ల మంది : ప్రపంచ బ్యాంక్ హెచ్చరిక

పాకిస్తాన్ లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. ద్రవ్యోల్బణం, నిత్యవసరాల ధరల పెరుగుదలతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. దేశ జనాభాలో 40 శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని తెలిపింది. ఇప్పటికే దేశ ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో దిగజారింది.. కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే భవిష్యత్ లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుందని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది. 

పాకిస్తాన్ లో  ఒక సంవత్సరంలోనే 34.2 శాతం నుంచి 39.4 శాతానికి పెరిగిందని..12.5 మిలియన్ల ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. ప్రస్తుతం దాదాపు 9.5 మిలియన్ల మంది పాకిస్తానీలు  ఆకలితో అలమటిస్తున్నారని ప్రపంచ బ్యాంక్ తెలిపింది.