బాధ్యతగా మొక్కలు నాటాలి : వినయ్ రెడ్డి

బాధ్యతగా మొక్కలు నాటాలి : వినయ్ రెడ్డి
  • ఆర్మూర్​ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి వినయ్ రెడ్డి

​ఆర్మూర్, వెలుగు: పర్యావరణాన్ని పరిరక్షిద్దామని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని కాంగ్రెస్​ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్​చార్జి వినయ్ రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా గురువారం ఆర్మూర్​లో మున్సిపల్​ కమిషనర్​ రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి బాబా గౌడ్​తో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.  మున్సిపల్ ఆధ్వర్యంలో పెర్కిట్ మహిళా సమైక్య భవనం నుంచి పెర్కిట్ చౌరస్తా వరకు స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. 19, 34 వార్డులలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించి, తడి,పొడి, హానికర చెత్త లను విభజించి మున్సిపల్ ఆటోలకు ఇవ్వాలని అవగాహన కల్పించారు. వీధి కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్​ డిగ్రీ కాలేజ్​ లో స్టూడెంట్స్​కు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. 

ఆర్మూర్ కోర్టు లో.. 

ఆర్మూర్​ మున్సిఫ్​ కోర్టు ఆవరణలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి సరళ, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గడుగు గంగాధర్ బార్​ అసోసియేషన్ అడ్వకేట్స్ తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడు గటడి ఆనంద్, సీనియర్ న్యాయవాదులు లోక భూపతిరెడ్డి, చిలుక కిష్టయ్య, ఖాందేశ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.