డీ హైడ్రేషన్ నుంచి కాపాడుకోవాలంటే...?

డీ హైడ్రేషన్  నుంచి కాపాడుకోవాలంటే...?

ప్రతి ఏటా  ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని  జరుపుకుంటారు. 1948 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసే అనేక ఆరోగ్య విషయాలపై అవగాహన పెంచేందుకు ఈ ప్రత్యేక దినోత్సవాన్ని కేటాయించింది. అయితే అందరూ ఆరోగ్యంగా గడపాలంటే ఆరోగ్యకరమైన జీవితం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ సమ్మర్ లో ఇప్పటికే  ఎండలు దంచి కొడుతున్నాయి.  వేసవి కాలంలో  తగినంత నీటిని తీసుకోకపోతే నీటి శాతం తగ్గి  డీహైడ్రేషన్ కు గురవుతాం.

 అందుకని వీలైనంతగా నీటిని ఎక్కువగా తీసుకోవాలి.. శరీరంలో తగినంత నీరు ఉంటేనే శరీర పనితీరు సక్రమంగా ఉంటుంది.  ప్రతి రోజూ 8 గ్లాసుల నీటిని కచ్చితంగా తాగేలా చూసుకుంటే  జీర్ణక్రియకు సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యానికి, శరీర ఉష్ణోగ్రత నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. కణాలకు పోషకాలు, ఆక్సిజన్ అందేలా నీరు సహకరిస్తుంది. శరీరంలో నీరు తగ్గితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.   అయితే నీళ్లు తాగడమే గాకుండా .. దాదాపు ఎక్కువ నీటితో గడపడం ఉత్తమం.

ఈ సీజన్‌లో మనం మన ఆరోగ్యం పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. అది మన శరీరంలోని పలు జీవ క్రియలను నెమ్మదిస్తుంది.   ఒక సగటు వ్యక్తి యొక్క బరువులో సగం.. మూడింట రెండు వంతుల నీటితో ఉంటుంది. అంటే ఉదాహరణకు 70 కిలోల వ్యక్తి శరీరంలో సుమారు 42 లీటర్ల నీరు ఉంటుంది. ఈ సీజన్‌లో ఎక్కువగా బాడీకి కూలింగ్ ఇచ్చే ఫుడ్, ఫ్రూట్స్ తీసుకోవాలి.

మన శరీరం నుండి  ముఖ్యంగా మూత్రవిసర్జన చేయడం ద్వారా  ఎక్కువ నీళ్లు బయటకు పోతాయి.  శరీర అవసరాలను బట్టి  మూత్రపిండాలు సాధారణంగా 800 ml నుంచి 2 లీటర్ల మూత్రాన్ని విడుదల చేస్తాయి. ఒక్కోసారి ఇది మారుతుంది.  ప్రతి రోజు ఊపిరితిత్తులు చర్మం నుండి ఆవిరైన నీటి ఆవిరిని వదులుతాయి. దాదాపు 750 మిల్లీ లీటర్ల నీటిని కోల్పోతాయి. ఎక్కువగా చెమట ద్వారా శరీరంలోని పొటాషియం, ఉప్పు వంటి ఖనిజాలు బయటకు వెళ్తాయి. దీంతో నీళ్లు, ఎలక్ట్రోలైట్‌లను తరచుగా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా వేసవిలో  రోజుకు రెండు లీటర్ల  నుంచి 4 లీటర్ల నీటిని తీసుకోవాలి. ఈ సీజన్‌లో ఎక్కువగా బాడీకి కూలింగ్ ఇచ్చే ఫుడ్, ఫ్రూట్స్ తీసుకోవాలి

 సమ్మర్ లో డీ హైడ్రేషన్ కు గురి కాకుండా ఉండాలంటే..

  • ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే కొబ్బరి నీళ్లను తీసుకోవాలి
  • ఇంట్లో వాతావరణ చల్లగా ఉండేటట్లు చూసుకోవాలి
  •  మజ్జిగ, ప్రోబయోటిక్స్,  పండ్ల జూస్ తీసుకోవాలి
  • నిమ్మ రసం  తీసుకోవాలి
  • పులియబెట్టిన కంజీ పానీయాలు ప్రోబయోటిక్స్ , ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి
  • ఎలక్ట్రోలైట్ సప్లిమెంట్లు డీహైడ్రేటెడ్ గా ఉంచుతాయి.
  • ఒంటికి వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. పలుచని బట్టలు వేసుకోవాలి.