ప్రపంచం థర్డ్ వేవ్ దిశగా వెళుతోంది

V6 Velugu Posted on Jul 16, 2021

భారత్ లో రానున్న మూడు, నాలుగు నెలలు ఎంతో కీలకమన్నారు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్. ప్రపంచం కరోనా థర్డ్ వేవ్ దిశగా వెళుతోందని.. ఇది కాదనలేని వాస్తవమన్నారు. భారత్ లో కరోనా పరిస్థితులపై నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమెరికా మినహా మిగతా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలిపారు.

భారత్ లో ఇప్పటివరకు హెర్డ్ ఇమ్యూనిటీ రాలేదని.. కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉందని తెలిపారు వీకే పాల్. దేశంలో కరోనా థర్డ్ వేవ్ రాకుండా చూడాలన్న లక్ష్యం దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. టీకా రెండు డోసులు తీసుకున్న వారిలో 95 శాతం మరణాలు తగ్గాయని అన్నారు.
 

Tagged corona third wave, heading world, VK Paul

Latest Videos

Subscribe Now

More News