
కరోనా వైరస్ సోకిన మొదటి వ్యక్తి ‘పేషెంట్ జీరో’ను కనుక్కోవడం కష్టమంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO). పేషెంట్ జీరోను ప్రపంచ ఎప్పటికీ కనుక్కోకపోవచ్చని WHO వ్యాధుల విభాగం సాంకేతిక అధికారి మరియా వ్యాన్ కెర్కోవా తెలిపారు. మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ మూలాలను కనుక్కోవడానికి WHO ఆధ్వర్యంలో10 మందితో కూడిన నిపుణుల బృందం చైనాలోని వూహాన్‌లో పరిశోధన ప్రారంభించింది. అయితే చాలా కాలం తర్వాత అక్కడికి చేరుకోవడంపైనా అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా కొత్త రకం కరోనా వైరస్ బయటపడుతోన్న క్రమంలో WHO ప్రపంచ దేశాలను అలర్ట్ చేసింది. వీటిని ఎదుర్కొనేందుకు వైరస్ సీక్వెన్సింగ్‌ను చేపట్టాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. అయితే, జెనెటిక్ కోడ్ సీక్వెన్సింగ్ విశ్లేషించడం అన్ని దేశాలకు సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడింది.