
చెంగ్డూ: వరల్డ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఇండియా మెన్స్ టీమ్ సంచలనం సృష్టించింది. ఆదివారం జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో ఇండియా టీమ్ 3–1తో వరల్డ్ రెండో ర్యాంకర్ జర్మనీకి షాకిచ్చింది. తొలి సింగిల్స్‌లో వరల్డ్ 37వ ర్యాంకర్ సత్యన్ 11–13, 4–11, 11–8, 11–4, 11–9తో డుడా బెనెడిక్ట్‌పై గెలిచాడు. రెండో సింగిల్స్‌లో 10–12, 7–11, 11–8, 11–8, 11–9తో వరల్డ్ 9వ ర్యాంకర్ డాంగ్ క్వియూపై నెగ్గాడు. మరో సింగిల్స్‌లో హర్మీత్ దేశాయ్ 7–11, 9–11, 13–11, 3–11తో డాంగ్ క్వియూ చేతిలో ఓడాడు. కానీ థర్డ్ సింగిల్స్‌లో మానవ్ థక్కర్ 13–11, 6–11, 11–8, 12–10తో రికార్డో వెల్తర్‌ను ఓడించి ఇండియాకు విజయాన్ని అందించాడు. విమెన్స్ కేటగిరీలో మనికా బాత్రా సారథ్యంలోని టీమిండియా 3–0తో చెక్ రిపబ్లిక్‌పై గెలిచింది.
ముకేశ్, రజత్‌కు పిలుపు
న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు టీమిండియాను ఆదివారం ప్రకటించారు. బెంగాల్ సీమర్ ముకేశ్ కుమార్, డొమెస్టిక్‌లో రాణించిన రజత్ పటీదార్‌కు తొలిసారి పిలుపు అందింది. శిఖర్ ధవన్ కెప్టెన్సీలో 16 మందిని ఎంపిక చేశారు. శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. న్యూజిలాండ్–ఎతో జరిగిన సిరీస్‌లో ముకేశ్ టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇక ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌తో పాటు రంజీ ట్రోఫీ ఫైనల్, కివీస్–ఎతో జరిగిన అనధికార టెస్ట్‌ల్లో పటీదార్ సెంచరీలతో చెలరేగాడు. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌తో పాటు దీపక్ చహర్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు. ఈ సిరీస్ తర్వాత శ్రేయస్, చహర్.. బ్రిస్బేన్‌లో వరల్డ్ కప్ టీమ్‌తో కలుస్తారు. ఈ నెల 6, 9, 11న వరుసగా లక్నో, రాంచీ, ఢిల్లీలో మూడు వన్డేలు జరగనున్నాయి. జట్టు: ధవన్ (కెప్టెన్), శ్రేయస్, రుతురాజ్, గిల్, రజత్ పటీదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్, సిరాజ్, దీపక్ చహర్.