మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా.. జస్ట్ రెండు అంటే రెండేళ్లలో అతి ప్రారంభం కాబోతుందా.. గ్రహాల మార్పు దానికి సంకేతమా.. 2028 నుంచి 2032 మధ్య.. అంటే ఆ నాలుగేళ్లలోనే వరల్డ్ వార్ 3 జరగబోతుందా.. ప్రపంచం మొత్తం యుద్ధాన్ని చూడబోతుందా.. ఆ నాలుగేళ్లు ప్రపంచానికి కాళరాత్రేనా.. ఇప్పుడే ఎందుకు ఈ చర్చ.. దేశ వ్యాప్తంగా ఎందుకీ డిస్కషన్.. గ్రహాలు ఏం చెబుతున్నాయి.. గ్రహాల మార్పు మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతమా.. ఈ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఆయన పేరు రుద్ర కరణ్ ప్రతాప్. సోషల్ మీడియాలో జ్యోతిష్యం ఫాలో అయ్యే వాళ్లకు సుపరిచితులే. ఇక రాజకీయ వార్తలను ఫాలో అయ్యే వాళ్లకూ ఈ రుద్ర కరణ్ ప్రతాప్ నోటెడ్ పర్సన్. ఈ రుద్ర కరణ్ ప్రతాప్ ఓ పోస్ట్ చేశారు.. అది కూడా మూడో ప్రపంచ యుద్ధం గురించి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న క్రమంలో ఆయన పోస్ట్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయింది. గ్రహాల మార్పులు సూచిస్తూ.. ఆయన చేసిన పోస్ట్ సారాంశం ఏంటో చూద్దాం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 2028 నవంబర్ నుంచి 2032 డిసెంబర్ మధ్య మూడో ప్రపంచ యుద్ధం అనివార్యంగా కనిపిస్తోంది. శని భగవానుడు భరణి (యమ) నక్షత్రంలో సంచరించడం.. అదే విధంగా రాహు గ్రహం అగ్ని తత్వమున్న ధనుస్సు రాశిలో సంచరించటం. ఈ గ్రహాల మార్పు వల్ల.. ఈ కాలం చరిత్రలోని చీకటి రోజులను గుర్తు చేస్తుంది. భారీ విధ్వంసంతో ప్రాణ నష్టాన్ని తీసుకు వస్తుందని అంచనా. ఈ మూడో ప్రపంచ యుద్ధం తర్వాత రియల్ ఎస్టేట్ (స్థిరాస్తి), స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతాయి. ఆర్థిక సంక్షోభం ఏర్పడవచ్చు. భరణి నక్షత్రం నిగ్రహానికి, పరివర్తనకు (జనన పునర్జన్మకు) ప్రతీక. అయితే.. రక్షణ మరియు ఫార్మా రంగాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి తెలివిగా పెట్టుబడి పెట్టండి. ఈ గందరగోళం తర్వాత, ఒక కొత్త మరియు సానుకూల శకం ఆవిర్భవిస్తుందని అంచనా.
Astrologically, between November 2028 - December 2032, World War 3 appears inevitable. With Saturn transiting Bharani (Yama) Nakshatra and Rahu in fiery Sagittarius, this period is expected to bring massive devastation and loss of life, echoing history’s darkest times. Economic…
— Rudra Karan Partaap🇮🇳 (@Karanpartap01) April 6, 2025
రుద్ర కరణ్ ప్రతాప్ వేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిస్కషన్స్కు దారి తీస్తోంది. భరణి నక్షత్రంలోకి శని ఎంటర్ అయితే ఇంత ప్రమాదంగా ఉంటుందా.. ధనస్సులోకి రాహువు వస్తే ప్రళయం తప్పదా ఏంటీ అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 2028 నవంబర్ నుంచి 2032 డిసెంబర్ మధ్య గ్రహాల మార్పుతో.. జ్యోతిష్యం ఆధారంగా మూడో ప్రపంచ వస్తుందా అనే ప్రశ్నలు, చర్చలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఏదిఏమైనా జస్ట్ ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి పరిస్థితులు ఇలా ఉంటే.. ఇక మూడో ప్రపంచ యుద్ధం అంటే.. అమ్మో ఊహించుకోవటానికే కష్టంగా ఉంది.. ఏమైనా రాబోయే రోజులు మంచిగా లేవని మాత్రం అర్థం అవుతుంది.
