కరోనా కాంటెస్ట్.. గెలిస్తే ఊహించని బహుమతులు

కరోనా కాంటెస్ట్.. గెలిస్తే ఊహించని బహుమతులు

కరోనా వైరస్ గత సంవత్సరం నుంచి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. వైరస్ బారినపడి లక్షలాది మంది చనిపోయారు. ఈ వైరస్ ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేసింది. అయితే ఈ కరోనా వైరస్ ఎదుర్కోవడం కోసం ఆయా దేశాలు వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. కానీ, వైరస్ మాత్రం ఎప్పటికప్పుడూ రూపాంతరం చెందుతూ.. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ వైరస్ మహమ్మారిని ఎదుర్కొవడానికి విద్యార్థులు ఏయే చర్యలు తీసుకుంటారో తెలుసుకోవాలని ఏఐ స్కూల్ ఆఫ్ ఇండియా భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఓ కాంటెస్ట్‌ను నిర్వహించ తలపెట్టింది. అందులో భాగంగా.. AI కోవిడ్ వారియర్ కాంటెస్ట్ పేరుతో ఆన్‌లైన్ వేదికగా ఒక కొత్త ప్రోగ్రాంను ముందుకు తీసుకువచ్చింది. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనడానికి 3 నుంచి 12 తరగతుల విద్యార్థులు అర్హులు. విద్యార్థులను 3 నుంచి 5 వరకు ఒక కేటగిరీగా, 6 నుంచి 8 వరకు ఒక కేటగిరీగా, మరియు 9 నుంచి 12 వరకు మరో కేటగిరీగా విభజించారు. ఈ పోటీలో పాల్గొనాలంటే విద్యార్థులు ఆన్‌లైన్‌లో  ఉచితంగా https://aischoolofindia.com/ai-covid-warriors/ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందులో కోడ్ లేదా నో కోడ్ అనే రెండు విభాగాలు ఉంటాయి. ఈ పోటీ జూన్ 1 నుంచి జూలై 31 వరకు నిర్వహించబడుతుంది. పోటీలో గెలుపొందిన విజేతలను ఆగస్టు 15న ప్రకటిస్తారు. విజేతలకు ఐఐటీ ఇంటర్న్‌షిప్, ల్యాప్‌టాప్‌ల వంటి అద్భుతమైన బహుమతులు అందజేయబడతాయి.