వరల్డ్ కప్ లో పాక్ ని చిత్తు చేద్దాం: సచిన్ పిలుపు

వరల్డ్ కప్ లో పాక్ ని చిత్తు చేద్దాం: సచిన్ పిలుపు

ముంబై: పుల్వామా దాడి నేపథ్యంలో వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో మాచ్ ఆడకుండా బాయ్ కాట్ చేయాలన్న వాదనపై లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. పాక్ జట్టును మరోసారి చిత్తుగా ఓడించే చాన్స్ ను టీమిండియా మిస్ చేసుకోవద్దని మాస్టర్ కోరాడు. మ్యాచ్ ను బాయ్ కాట్ చేయడం తనకు ససేమిరా ఇష్టం లేదని చెప్పాడు.
‘‘వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ను అనేక సార్లు భారత్ ఓడించింది. మరోసారి వాళ్లను చిత్తు చేసే టైం వచ్చంది. మ్యాచ్ ను బాయ్ కాట్ చేసి వారికి 2 పాయింట్లు ఇచ్చి హెల్ప్ చేయడం నాకు అసహ్యం కలిగిస్తుంది’’ అని సచిన్ అన్నాడు. తన వరకు దేశమే ముందు అని, భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. దానికి పూర్తిగా మద్దతిస్తానని చెప్పాడు.
పాక్ తో మ్యాచ్ ఆడి చిత్తుగా ఓడిద్దామంటూ సునీల్ గవాస్కర్ ఇప్పటికే పిలుపునిచ్చాడు. అదే బాటలో టెండూల్కర్ కూడా పాక్ టీమ్ కు గ్రౌండ్ లో బుద్ధి చెప్పే చాన్స్ వదులుకోవద్దని సూచించాడు.