ఇంత వేగంగా పరిస్థితులు ఎలా మారాపోయాయో అర్థం కావడం లేదు

ఇంత వేగంగా పరిస్థితులు ఎలా మారాపోయాయో అర్థం కావడం లేదు

శ్రీలంకతో త్వరలో జరగనున్న టెస్టు సిరీస్ కు టీమిండియా జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. అయితే టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహాకు జట్టులో చోటు దక్కలేదు. దీంతో మీడియా ముందుకు వచ్చిన సాహా సంచలన ఆరోపణలు చేశాడు. రిటైర్మెంట్ గురించి ఆలోచించాలని తనకు టీమ్ మేనేజ్ మెంట్( రాహుల్ ద్రావిడ్) సూచించిందన్నాడు. భవష్యత్ లో తనకు టీంలో చోటు దక్కకపోవచ్చని ముఖం మీదే చెప్పేసిందన్నాడు.

న్యూజిలాండ్ తో జరిగిన టెస్టులో కీలక ఇన్నింగ్స్ ఆడిన తర్వాత టెస్టు జట్టులో స్థానం గురించి  బీసీసీఐ చీఫ్ గంగూలీ భరోసా ఇచ్చాడని చెప్పాడు. తాను బీసీసీఐ చీఫ్ గా ఉన్నంత కాలం దేని గురించి ఆలోచించాల్సిన పనిలేదన్నాడు. కానీ ఇంతలోనే పరిస్థితులు ఎలా మారిపోయాయో అర్థం కావడం లేదన్నాడు. అంతేగాకుండా ఓ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ కావాలని తనను బలవంతం చేశాడని ట్వీట్ చేశాడు. జర్నలిస్ట్ చేసిన వాట్సప్ చాట్ ను స్క్రీన్ షాట్ లను సాహా పోస్ట్ చేశాడు .