ఈ అలవాట్లు ఉంటే.. మీకు కచ్చితంగా షుగర్ వస్తుంది

ఈ అలవాట్లు ఉంటే.. మీకు కచ్చితంగా షుగర్ వస్తుంది

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.. ఈ ఆధునికి యుగంలో మన ఆహారపు అలవాట్లు మనకు చాలా రోగాలను తెచ్చిపెడుతున్నాయి. అందులో ఎక్కువ మందికి డయాబెటిస్​ సమస్య. చాలా మంది డయాబెటిస్ సమస్యతో బాధ పడుతున్నారు. అటువంటి వాళ్లు ఆహారం విషయంలో   ఎంత జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎంత జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యం అంత బాగుంటుంది.  నిజంగా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం మన మొత్తం ఆరోగ్యం మరియు శ్రేయస్సులో ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి ఒక్కరి ఆహార అవసరాలు మరియు ప్రాధాన్యతలు భిన్నంగా ఉంటాయి ..మధుమేహం అదుపులో ఉండాలంటే పాటించవలసిన ఆహార నియమాలను ఇప్పుడు చూద్దాం. . . .

అధిక చక్కెర ఎంత హాని తెలుసా

చక్కెర అధికంగా ఉన్న ఆహార పదార్ధాలు  తీసుకోవడం వల్ల తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటి ప్రయోజనకరమైన ఆహారాల వినియోగం తగ్గిపోతుంది. ఇవన్నీ శరీరానికి అవసరమైన కీలకమైన ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, ఇతర ముఖ్యమైన పోషకాలకు ముఖ్యమైన మూలాలు.  అధిక చక్కెర వినియోగం టైప్ 2 మధుమేహం పెరుగుతుంది.  

ప్రాసెస్ చేయబడిన కార్బోహైడ్రేట్లు

కార్బొహైడ్రేడ్లు   శక్తిని ఇస్తాయి. వీటిని తక్కువ నీటితో జీర్ణం చేసుకోవచ్చు. తెల్ల రొట్టె, తెల్ల బియ్యం  పాస్తా శుద్ధి చేసిన ధాన్యాలు  సులభంగా జీర్ణమవుతాయి. ఇవి  రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి.    

ఫైబర్ లేకపోవడం

ఫైబర్ లేకపోవడం వల్ల, శరీరంలో అనేక రకాల సమస్యలు పెరుగుతాయి. ఎందుకంటే ఫైబర్ తగినంత మొత్తంలో తీసుకోకపోతే, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలతో పాటు డయాబెటిక్ కూడా పెరుగుతుంది. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు ,  చిక్కుడులో ఫైబర్ అధికంగా ఉంటుంది.  డైటరీ ఫైబర్ లేని ఆహారం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థిరంగా ఉండదు,  దీని వలన    ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది . రక్తంలో చక్కెర స్థాయిలు ఫైబర్ ద్వారా బాగా నియంత్రించబడతాయి.

అనారోగ్య కొవ్వులు

కొవ్వు  ఉన్న పదార్ధాలు తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వృద్ది చెందుతుంది.  ప్రాసెస్ చేయబడిన , వేయించిన ఆహార పదార్ధాలతో పాటు  పాల ఉత్పత్తులలో  అధిక కొవ్వు ఉంటుంది.   వీటిని తీసుకోవం వల్ల ఊబకాయం పెరిగి.. ఇన్సులిన్ తగ్గుతుంది. 

అతిగా తినడం

క్రమం తప్పకుండా అధికంగా తినడం వల్ల బరువు పెరుగుట మరియు ఊబకాయం ఏర్పడుతుంది., ఇది టైప్ 2 డయాబెటిస్‌కు ముఖ్యమైన ప్రమాద కారకాలు.

భోజనం వేళలు పాటించకపోవడం

భోజన వేళలు కూడా పాటించాలి.  ఆహారపు అలవాట్లు మారితే రక్తంలో చక్కెర నియంత్రణను దెబ్బతీస్తుంది. మీరు ఆకలితో అలమటిస్తున్న సందర్భంలో మానసిక కల్లోలం మరియు చికాకు కలిగించే వైఖరి చాలా సాధారణం. మీ శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయి తక్కువగా ఉండటం వల్ల, మీరు త్వరగా చికాకు పడతారు. మీరు దీన్ని అలవాటు చేసుకుంటే లక్షణాలు తీవ్రమవుతాయి. మీరు మరింత ఒత్తిడికి గురవుతారు మరియు నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు

ఫాస్ట్ ఫుడ్స్ 

 ఫాస్ట్ ఫుడ్స్  తరచుగా తీసుకోవడం వల్ల బరువు పెరగడంతో పాటు , ఇన్సులిన్ తగ్గిపోతుంది.  దీని వలన  మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, వీటిలో  అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెరలు, సోడియం  అధికంగా ఉంటాయి.