సైంధవ్ ఫస్ట్ సాంగ్ రిలీజ్..మెసేజ్తో అదరగొట్టిన వెంకీ మామ

సైంధవ్ ఫస్ట్ సాంగ్ రిలీజ్..మెసేజ్తో అదరగొట్టిన వెంకీ మామ

విక్టరీ వెంకటేష్(Venkatesh హీరోగా నటిస్తున్న 75వ సినిమా ‘సైంధవ్’(Saindhav). శైలేష్ కొలను( Sailesh Kolanu) దర్శకత్వంలో ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.  

లేటెస్ట్గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. అరే నీ బాధలలోనే..నువ్వు తాగుతున్నావు రా.. రేయ్ నీ ఏడ్పులలోనే తాగుతున్నావు రా..తాగి ఖుషినే డబల్ చేస్తావా..లేక బాధనే డబల్ చేస్తావా.. అంటూ సాగే ఈ పాట చాలా హమ్మింగ్ గా ఉంది. రాంగ్ యూసేజ్ అంటూ..వెంకీ మామా వేసే స్టెప్స్తో పాటు..ఆ పాటలోని లిరిక్స్కు ఇచ్చే హమ్మింగ్స్ మరింత జోష్ పెంచుతుంది.

ఈ పాటకు ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ లిరిక్స్ అందించగా..నకాష్ అజీజ్ పాడారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రపీ అందించారు. ఫోన్, మద్యాన్ని..ఇలాంటి వాటిని తప్పు పద్ధతిలో ఉపయోగించకు అంటూ..చంద్రబోస్ చాలా సింపుల్గా చెప్పేశారు. సంతోష్ నారాయణ్ స్వరపరిచిన ఈ గీతం బార్ లలో..ఊర్లలో సరదాగా తాగి చిల్ అయ్యే టైంలో పాడుకునేలా స్వరపరిచారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ భారీ అంచనాలు పెంచేసింది. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో పాటలా నగరా మోగించడానికి మేకర్స్ రెడీ అయ్యారు.

హై-ఆక్టేన్ యాక్షన్‌‌‌‌గా రూపొందుతోన్న ఈ చిత్రంతో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్స్. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో జనవరి 13న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.