వాళ్లిద్దరి కెప్టెన్సీకి అగ్ని పరీక్ష

వాళ్లిద్దరి కెప్టెన్సీకి అగ్ని పరీక్ష

వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే పోరు కోసం అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. రెండు టాప్ టెస్ట్ టీమ్స్ నడుమ జరగనున్న ఈ సంగ్రామం.. సంప్రదాయ క్రికెట్‌ పోరులో అతిపెద్ద మ్యాచుల్లో ఒకటిగా చెప్పుకోచ్చు. ఈ మ్యాచ్ కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, టీమిండియా సారథి విరాట్ కోహ్లీల కెప్టెన్సీ సత్తా ఏంటో బయట పెడుతుందని న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సన్ అన్నాడు. ఇంగ్లీష్ గడ్డపై స్వింగింగ్ బంతులను భారత టాపార్డర్ బ్యాట్స్‌‌మెన్ ఎలా ఎదుర్కొంటారనే దానిపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుందన్నాడు.  

‘విరాట్, కేన్ విలియమ్సన్ మంచి సారథులనే చెప్పాలి. ఇద్దరి కెప్టెన్సీ శైలి భిన్నంగా ఉంటుంది. కేన్ అవతలి జట్టుపై మెళ్లిగా ఒత్తిడి పెడతాడు. అదే విరాట్ తన జట్టును ముందంజలో ఉంచడానికి అనుక్షణం యత్నిస్తుంటాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ ఇరు జట్ల కెప్టెన్‌లకు కీలకం కానుంది. వారిద్దరూ తమ ప్రణాళికలను ఏ విధంగా అమలు చేస్తారో చూడాలి’ అని హెస్సన్ పేర్కొన్నాడు.