వుహన్ లో ఉన్నోళ్లందరికీ కరోనా టెస్ట్ లు

వుహన్ లో ఉన్నోళ్లందరికీ కరోనా టెస్ట్ లు
  • చైనా సంచలన నిర్ణయం

వుహాన్ : కరోనా కు కేంద్ర స్థానమైన వుహాన్ లో ఉన్నళ్లోందరికీ కరోనా టెస్ట్ లు చేయాలని చైనా నిర్ణయించింది. సిటిలోని కోటి 10 లక్షల మందికి 10 రోజుల్లోనే కరోనా టెస్ట్ లు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కరోనా ఫస్ట్ కేసు ఇక్కడే నమోదైన విషయం తెలిసిందే. 76 రోజుల పాటు కఠినంగా లాక్ డౌన్ విధించి చైనా ఇక్కడ పరిస్థితిని పూర్తిగా కంట్రోల్ లోకి తెచ్చింది. దాదాపు నెల రోజుల పాటు కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ రెండు రోజులుగా వుహాన్ లో మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. మే 10, 11 తేదీల్లో కొత్తగా ఆరు కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం వుహాన్ కరోనా కేసులను గుర్తించి వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సిటిలోని అన్ని డివిజన్ల వారీగా ప్లాన్ సిద్ధం చేశారు. ఇటీవల క్వారంటైన్ లో ఉన్న వారికి కూడా కరోనా లక్షణాలు కనిపించాయి. ఓకే అపార్ట్ మెంట్ కు చెందిన చాలా మందికి కరోనా లక్షణాలు కనిపించటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. మళ్లీ కరోనా విజృంభించకుండా తగిన జాగ్రత్తల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. జనవరి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు వుహాన్ సిటి లాక్ డౌన్ లోనే ఉంది. ఇటీవలే సాధారణ పరిస్థితి నెలకొంది.