X గా మారిన తర్వాత.. రాకెట్ గా దూసుకెళుతోంది..

X గా మారిన తర్వాత.. రాకెట్ గా దూసుకెళుతోంది..

X గా పిలువబడే ట్విట్టర్ ఇప్పుడు సరికొత్త రికార్డును నెలకొల్పింది. 2023లో నెలవారి వినియోగదారుల సంఖ్య కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంందని X యజమాని ఎలాన్ మస్క్ వృద్ధి గ్రాఫ్ ను షేర్ చేశారు. భారీ సంఖ్యలో బాట్ లను తొలగించిన తర్వాత కూడా ఈ గ్రాఫ్ 2023 కొత్త గరిష్ట స్థాయికి చేరుకుందని ట్వీట్ లో పేర్కొన్నారు. 

ట్విట్టర్ బ్రాండ్ కు  త్వరలో వీడ్కోలు పలికి X  బ్రాండ్ తో భర్తీచేయబడుతుందని జూలై 23 తర్వాత ఎలాన్ మస్క్  రీబ్రాండింగ్ పై ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. ఇకపై ఈ ప్లాట్ ఫారమ్ వెబ్ వెర్షన్ లో  X లోగో కనిపించనుందని తెలిపారు. అయితే ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలో లోగోను తొలగిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.  

ఎట్టకేలకు ఈ వారం మొదట్లో ఆండ్రాయిడ్ యాప్ ట్విట్టర్ లోగోను అప్ డేట్ చేశారు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యాడ్ క్రియేటర్ల కోసం యాడ్స్ షేర్ ప్రోగ్రామ్ ను కూడా ప్రారంభించినట్లు ట్విట్టర్ ప్రకటించింది. ఇంటర్నెట్ లో ఇది కంటెంట్ రైటర్లకు ఉపాధి కల్పించే ఉత్తమ ఫ్లాట్ ఫారమ్ గా మార్చాలనే లక్ష్యంతో  ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. 

 ట్వి్ట్టర్ ను XCorp గా మార్చే ప్రక్రియ కేవలం కంపెనీ పేరును మార్చేలా కాకుండా రెండు ప్రధాన లాభాలున్నాయని మస్క్ స్పష్టం చేశారు. Xని వేగవంతం చేయడం, వాక్ స్వాతంత్ర్యాన్ని నిర్దారించబడుతుందని పేర్కొన్నారు. ట్విట్టర్ ఫ్లాట్ ఫారమ్ ప్రారంభంలో  కేవలం 140 పదాలకు మాత్రమే  మేసేజ్ పరిమితం అయి ఉండేదని.. ఇప్పుడు సుదీర్ఘమైన వీడియోలు, వివిధ రకాల కంటెంట్ లను పోస్ట్ చేయగల సామర్థ్యంతో రీబ్రాండింగ్ ఫ్లాట్ ఫారమ్ ను మెరుగు పర్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.