ఇది యాపారం : X (ఎక్స్) కొత్త రేట్లు పెట్టనున్న మస్క్.. డబ్బులు కడితేనే లాగిన్..!

ఇది యాపారం : X (ఎక్స్) కొత్త రేట్లు పెట్టనున్న మస్క్.. డబ్బులు కడితేనే లాగిన్..!

ఎక్స్.. X. ట్విట్టర్ ను ఎలన్ మస్క్ కొనుగోలు తర్వాత చేర్పులు, మార్పులు భారీ ఎత్తున చేశారు. అంతేకాదు.. ఏదీ ఊరికే రాదు అన్న వ్యాపార సూత్రానికి అనుగుణంగానే వ్యవహరిస్తున్నారు. పక్కా కమర్షియల్ గా దూసుకెళుతున్నారు. ఇప్పటికే నెలవారీ ఛార్జీలు పెట్టారు. బ్లూ టిక్ కావాలంటే పే చేయాల్సిందే ఎవరైనా.. పర్సనల్, బిజినెస్, గవర్నమెంట్ ఇలా వివిధ కేటగిరీల కింద.. ఛార్జీలతోపాటు.. సబ్ స్క్రిప్షన్ అమౌంట్ డిసైడ్ చేసి.. ఇది యాపారం అంటున్నారు ఎలన్ మస్క్.. ఇప్పుడు దానికి కొనసాగింపుగా.. రెండు కొత్త సబ్ స్క్రిప్షన్ ప్రకటించారు మస్క్. ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కచ్చితంగా డబ్బులు కట్టాల్సిందే అనే విధంగా.. ఎక్స్ ను తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఎక్స్ అకౌంట్ లాగిన్ కు కనీసంలో కనీసం ఏడాదికి డాలర్.. అంటే 82 రూపాయలు కడితేనే.. యాక్టివేట్ అవుతుంది.. లేకపోతే ఇప్పుడున్న అకౌంట్స్ అన్నీ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయనే ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నాయని.. మస్క్ పోస్టుల ద్వారా స్పష్టం అవుతుంది. 

ఆప్షన్ వన్ : 

తక్కువ ధరలో సబ్ స్క్రిప్షన్. అన్ని ఆప్షన్స్ ఉంటాయి.. ప్రతి ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. కాకపోతే యాడ్స్ ఉంటాయి. యాడ్స్ లో ఎలాంటి మినహాయింపు ఉండదు. దండిగా యాడ్స్ కనిపిస్తాయి. తక్కువ ధరలో ఫుల్ ఆప్షన్స్ ను కస్టమర్లకు ఇస్తూ.. యాడ్స్ ద్వారా ఆదాయాన్ని పొందటం అన్నమాట. ప్రస్తుతం నెలకు 8 డాలర్లుగా ఉన్న సబ్ స్క్రిప్షన్ ధరను.. తగ్గించాలనే ఆలోచన చేస్తున్నారు. అదే విధంగా ఏడాదికి ఒక్క డాలర్.. అంటే మన కరెన్సీలో సంవత్సరానికి 82 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. కాకపోతే యాడ్స్ ఫుల్ గా వస్తాయి. 

ఆప్షన్ టూ :

ధర ఎక్కువగా ఉంటుంది. అన్ని ఫ్యూచర్స్ ఉంటాయి. ఫుల్ గా వాడేసుకోవచ్చు. ధరకు తగ్గట్టుగానే ఆప్షన్స్ ఇస్తారు.. కాకపోతే మీరు ధర ఎక్కువ చెల్లిస్తున్నారు కనుక.. అస్సలు యాడ్స్ డిస్ ప్లే ఉండదు. ఎలాంటి డిస్ట్రమెన్స్ ఉండదు. ధర ఎక్కువ చెల్లిస్తున్నారు కదా.. ఆ మాత్రం వెసలుబాటు ఇస్తారన్న మాట. ప్రస్తుతం అందరికీ ఉన్నట్లే నెలకు 8 డాలర్లను.. మరింత పెంచి.. ప్రీమియం సబ్ స్క్రిప్షన్ కింద దీన్ని మార్చనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న 8 డాలర్లుగా ఉంది.. అంటే మన దగ్గర 650 రూపాయలు పడుతుంది. దీన్ని వెయ్యి రూపాయల వరకు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తుంది. అప్పుడు యాడ్స్ ఉండవు. 

త్వరలో ఈ రెండు ఆప్షన్స్.. సబ్ స్క్రిప్షన్స్ కొత్తగా అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు ఆ సంస్థ ఓనర్ ఎలన్ మస్క్.. ట్విట్టర్ కొనుగోలు తర్వాత లోగోతో సహా మొత్తం మార్చేశారు.. మస్క్ చేతిలో దివాళా అనుకున్నారు అందరూ.. అబ్బే ఫుల్ ఇన్ కంతో.. ఎప్పటికిప్పుడు మార్పులతో.. దూసుకెళుతున్నారు మస్క్. వాడుకున్నోడికి వాడుకున్నంత అన్నట్లు.. ఎక్స్.. తన స్వరూపాన్ని మార్చుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక నుంచి ఎక్స్.. అనేది ఉచితం లేదు అనే విధంగా తీసుకురానున్నట్లు తెలుస్తుంది.