ట్విట్టర్ హెడ్ ఆఫీస్ పై ఉన్న లోగో డిస్ ప్లే తొలగింపు

ట్విట్టర్ హెడ్ ఆఫీస్ పై ఉన్న లోగో డిస్ ప్లే తొలగింపు

కొన్ని రోజుల క్రితమే ట్విట్టర్ లోగో నుంచి బ్లూ కలర్ ఉండే పిట్టను తొలగించి.. దాని స్థానంలోకి ఎక్స్ గుర్తును అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ట్విట్టర్ ప్రధాన కార్యాలయంపై లోగో సింబల్ ను, ముందు ఏర్పాటు చేసిన డిస్ ప్లే బోర్డును తాజాగా తొలగించారు. చుట్టు పక్కల ఉండే వారప కంప్లైంట్ చేయడంతోనే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అంతకుముందు ట్విట్టర్ హెడ్ ఆఫీస్ బిల్డింగ్ పై ఎక్స్ లోగో డిస్ ప్లే లోపల మెరిసే ప్రకాశవంతమైన లైట్లను అమర్చారు. అయితే ఆ కాంతి నేరుగా తమ ఇళ్లలోకి ప్రసరిస్తోంది.. దాని వల్ల వారి నిద్రకు ఆటంకం కలుగుతుందని 24మంది స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బిల్డింగ్ ఇన్ స్పెక్టర్లు రంగంలోకి దిగి ప్రజల సౌకర్యార్థం ట్విట్టర్ హెడ్ ఆఫీస్ పై ఉన్న లోగోను తొలగించారు.