యాదాద్రికి పోటెత్తిన భక్తులు 

యాదాద్రికి పోటెత్తిన భక్తులు 

తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం వీకెండ్  కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాకతో యాదగిరీశుని సన్నిధి భక్తులతో రద్దీగా మారింది. క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్లు, కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి.. కిటకిటలాడుతున్నాయి. స్వామి వారి దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. భక్తుల రద్దీదృష్ట్యా లఘు దర్శన సౌకర్యం ఏర్పాటు చేశారు అధికారులు. ప్రధానాలయంలో ఉదయం నుంచి ఆరాధనలు, స్వామివారి నిత్య కైంకర్యాలను అర్చకులు శాస్త్రోక్తంగా చేపట్టారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.