
యాదాద్రి, వెలుగు: డెడ్‌లైన్ లోగా సీఎంఆర్ కంప్లీట్ చేయాలని అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. తన ఆఫీసులో మిల్లర్లతో మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. 2024–-25 వానాకాలం సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్‌ను ఇప్పటి వరకు 83 శాతం మాత్రమే అందించిన విషయాన్ని గుర్తు చేశారు. మిగిలిన సీఎంఆర్ నవంబర్12లోగా అందించాలని సూచించారు. బ్యాంక్ గ్యారంటీ చెల్లించిన మిల్లులకే 2025-–26 వానాకాలం సీజన్ వడ్లను సీఎంఆర్‌కు ఇస్తామని తెలిపారు.
బ్యాంక్ గ్యారంటీ చెల్లించకుండా, వడ్లను తీసుకోని మిల్లుల అనుమతులు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. మీటింగ్‌లో సివిల్‌సప్లయ్ డీఎం హరికృష్ణ, డీసీఎస్వో రోజా రాణి, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు మార్త వెంకటేశం, పసుపునూరి నాగభూషణం, మనోహర్ సహా మిల్లర్లు ఉన్నారు.