యాదాద్రి, వెలుగు: జిల్లాను డ్రగ్స్రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని యాదాద్రి అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన డ్రగ్స్ నిర్మూలన మీటింగ్లో ఆయన మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.
డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ తమవంతు కర్తవ్యాన్ని నిర్వహించాలన్నారు. గుడుంబా తయారీ, రవాణా, వినియోగంపై నిఘా పెంచాలని ఆదేశించారు. అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, ఆర్డీవో కృష్ణారెడ్డి, ఫారెస్ట్ ఆఫీసర్ పద్మజారాణి, డీఈవో సత్యనారాయణ, ఎక్సైజ్ ఎస్పీ విష్ణుమూర్తి, ఇంటర్మీడియట్ఆఫీసర్ రమణి, వివిధ విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, వైద్యారోగ్యశాఖల అధికారులున్నారు.
