మాకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి సార్..! స్కూల్ పరిశీలకు వచ్చిన కలెక్టర్‌‌ను కోరిన స్టూడెంట్

 మాకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి సార్..! స్కూల్ పరిశీలకు వచ్చిన కలెక్టర్‌‌ను కోరిన స్టూడెంట్
  • స్కూల్ పరిశీలకు వచ్చిన కలెక్టర్‌‌ను కోరిన స్టూడెంట్ 
  • విద్యార్థిని మెచ్చుకున్న కలెక్టర్ హనుమంతరావు

యాదగిరిగుట్ట, వెలుగు: ప్రభుత్వ స్కూల్ పరిశీలకు వచ్చిన కలెక్టర్‌‌ను కీర్తికుమార్ అనే  విద్యార్థి తమకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదని ప్రశ్నించడంతో కలెక్టర్ విద్యార్థి ధైర్యాన్ని ప్రశంసించారు.  యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మోటకొండూర్ మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని జడ్పీ హైస్కూల్‌ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని టీచర్లకు సూచించారు. కీర్తి కుమార్ అనే విద్యార్థి తమకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని కలెక్టర్ ను ప్రశ్నించగా.. వెంటనే ఎంపీడీవోతో మాట్లాడారు. 

ఖాళీ స్థలం లేనందున ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని చెప్పారు. విద్యార్థి కీర్తి కుమార్ ను అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ నిర్వహించాలని, విద్యార్థులను దత్తత తీసుకుని ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని సూచించారు.